Home » Chittoor
పురాణ కథనంలో, విష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి, వాకులమ్మ (పద్మావతి)ని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత ఆయన తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ కథనం భక్తులకు తిరుమలను దైవీయ క్షేత్రంగా భావించేలా చేసింది.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం గంగమ్మ టెంపుల్ పాలకమండలి కమిటీని సోమవారం నాడు నియమించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
శ్రీవారి దర్శనార్ధం వచ్చిన వారిని అలిపిరి భద్రత వలయం వద్ద సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కొండపైకి అనుమతి ఇస్తారు. అయితే సోమవారం ఉదయం ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చాడు. చెకింగ్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి వాహనాన్ని ఆపకుండా భద్రతా సిబ్బందిని తప్పించుకుని తిరుమలకు వచ్చాడు.
దేశంలోనే ప్రత్యేకమైన, భిన్నమైన సంస్కృతి తెలుగువారిది అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.
జిల్లాలోని ఎనిమిది సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో 55 రిజిస్ర్టేషన్లు ఆదివారం జరగ్గా ప్రభుత్వ ఖజానాకు రూ.9.10 లక్షలు ఆదాయం వచ్చింది.
బియ్యం కార్డుదారుల ఈకేవైసీ నమోదుకు పౌరసరఫరాలశాఖ ఏప్రిల్ 30వ తేదీవరకు గడువు పొడిగించింది.
తిరుపతి : వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాత్రూంలో కాలిజారిపడి తీవ్రగాయాలయ్యాయి.
పారా మెడికల్ విద్యార్థినులను ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లు లైంగికంగా వేధించారని 20 మంది పారా మెడికల్ విద్యార్థినులు రాతపూర్వకంగా రుయా సూపరింటెండెంటుకు పిర్యాదు చేసారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటపతి, రాజశేఖర్ను ఆర్దోపెడిక్ ఓపీ విభాగానికి బదిలీ చేశారు.
తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో పాపవినాశనం డ్యాం ఒకటి. ఈ నీరు పవిత్రమైనదిగా భక్తులు నమ్ముతారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఈ నీటిలో స్నానం చేసి ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారు. అలాంటి ఈ డ్యాంలో బోటింగ్ సౌకర్యం ప్రవేశపెడితే ఇది ఒక తీర్థయాత్ర స్థలం కంటే విహార కేంద్రంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు.