CM Chandrababu: సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ప్రముఖ ఆలయ కమిటీ నియామకం
ABN , Publish Date - Mar 31 , 2025 | 06:43 PM
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం గంగమ్మ టెంపుల్ పాలకమండలి కమిటీని సోమవారం నాడు నియమించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

చిత్తూరు: కుప్పం గంగమ్మ టెంపుల్ పాలకమండలి కమిటీని సీఎం చంద్రబాబు నియమించారు. చైర్మన్‌తో కలిపి 11 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. బీఎంకే రవిచంద్ర బాబు చైర్మన్‌గా, మరో 10 మందిని సభ్యులుగా నియమించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రెండేళ్ల పాటు కుప్పంలో రవిచంద్ర అన్నా క్యాంటీన్‌ను నిర్వహించారు. గత జగన్ ప్రభుత్వ దాష్టీకాలను ఎదిరించి అన్నా క్యాంటీన్‌ను రవిచంద్ర నిర్వహించారు.
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమైన టెంపుల్ కావడంతో స్వయంగా కమిటీని ఎంపిక చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గంగమ్మ టెంపుల్ కమిటీ పదవులనూ వివాదంలోకి నెట్టింది. దేవాలయం పవిత్రత, ప్రతిష్టత పెంచేలా కమిటీ ఉండాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేశారు. దీనిలో భాగంగా స్వయంగా కమిటీని ఎంపిక చేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త కమిటీలో పదిమంది సభ్యుల్లో సామాజిక సమతుల్యతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. సభ్యులుగా శారదమ్మ, నరేష్, సింధూ రాజకుమార్, మంజుల మణి, సంతోషమ్మ జయరామ నాయుడు, ఎస్ .మహేష్ ,ఎన్. వినాయకన్, వీణల శరవణన, వి ఏ.లక్ష్మి, జ్యోతిష్‌లను నియమించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు
Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ
Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్
Read Latest AP News And Telugu News