Home » CM KCR
Telangana Elections: సీపీఎం, సీపీఐ లిస్ట్‌కు కాంట్రవర్సీ లేదని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో తాము భాగస్వాములమన్నారు. ప్రియాంకగాంధీ సభలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇవాళ జాతీయ నాయకులు టి.రాజా ఖమ్మం వస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ముదుర్లని.. ఐదు సీట్లు అడిగితే తమకు ఒక్క సీటే కేటాయించారని తెలిపారు. వివేక్ గద్దలా తమకు కేటాయించాల్సిన సీటు ఎత్తుకుపోయారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గుమ్మరించి అప్పుల తెలంగాణగా చేశారని బీజేపీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్బీనగర్‌లో నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నట్టేట ముంచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము ఎవ్వరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదు తెలంగాణ మా టీమ్ అని బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ ( CM KCR )లక్షల కోట్లు దోచుకున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Dharmapuri Arvind ) అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ముస్లిం పిల్లలు హోటలల్లో చాయికప్పులు కడిగేవారని హోం మంత్రి మహమ్మద్ అలీ ( Home Minister Muhammad Ali ) అన్నారు.
బీఆర్ఎస్ ( BRS ) పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం..హక్కుల సాధించుకోవడం కోసమని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణని అభివృద్ధి చేయడం కంటే రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తీసుకెళ్లారని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) పేర్కొన్నారు.
సాధించుకున్న తెలంగాణ తొమ్మిదిన్నరేళ్లుగా ఓ దొర చేతిలో బందీ అయిందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) పేర్కొన్నారు.
లక్ష కోట్లను కేసీఆర్ ( KCR ) నీటి పాలు చేశారని బీజేపీ ఎంపీ అరవింద్ 9 Arvind ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధారిలో బీజేపీ అభ్యర్థి సుభాష్ రెడ్డి తరఫున ఎంపీ అరవింద్ ప్రచారం చేశారు.