Home » Delhi Excise Policy
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈరోజు(శుక్రవారం) విచారణ చేపట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొత్త ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో 38 మందిని నిందితులుగా పేర్కొనగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును 37వ నిందితుడుగా చేర్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటంలేదు. అరెస్టై నాలుగు నెలలు గడుస్తున్నా కవితకు ఈకేసులో బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ అరెస్టుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందుకు బంధించిన వీడియోను ఆమె శనివారంనాడు విడుదల చేశారు. ఎన్డీయే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిందని ఆ వీడియోలో ఆమె ఆరోపించారు.
ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12వ తేదీ వరకు బుధవారంనాడు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను జైలు అధికారులు హాజరుపరిచారు. తదుపరి కేసు విచారణ జూలై 25 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందన్న ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. మూడు రోజుల సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇంతకుముందే కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్టు చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ సుప్రీకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను జూన్ 26 వరకు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.