Share News

Aam Aadmi Party: కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు

ABN , Publish Date - Jul 14 , 2024 | 07:59 PM

మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే బీజేపీదే బాధ్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Aam Aadmi Party: కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు

న్యూఢిల్లీ, జులై 14: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే బీజేపీదే బాధ్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సరైన రీతిలో వైద్య సహాయం అందించకుండా చంపాలని బీజేపీ పథక రచన చేసిందని ఆరోపించారు.

Also Read: Harash Nagotra: యువకుడు ఆత్మహత్య.. మోదీకి మృతుడి ఫ్యామిలీ లేఖ


ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నన్ని సంక్షేమ పనులు బీజేపీ చేయడం లేదన్నారు. అందుకే ఈ తరహా కేసులు పెట్టి కేజ్రీవాల్‌ను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియంత తన ప్రత్యర్థులను.. వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చడానికి, వారిని చంపడానికి కటకటాల వెనుక ఉంచుతాడంటూ ప్రధాని మోదీపై ఆమె పరోక్షంగా విమర్శించారు.

Also Read: Kargil War: అమరవీరులకు రక్షణ మంత్రిత్వ శాఖ ఘన నివాళి

Also Read: BJP Chief: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు..!

Also Read: AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు


గత 30 ఏళ్లుగా సీఎం కేజ్రీవాల్ షుగర్ వ్యాధితో భాదపడుతున్నారన్నారు. అలాంటి ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జైల్లోకి వైద్యులను అనుమతించలేదన్నారు. అలాంటి వేళ.. చివరకు కోర్టు జోక్యం చేసుకుంటేనే కానీ దారికి రాలేదన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ భయంకరమైన అపాయకర పరిస్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శరీరంలో షుగర్ స్థాయిలు.. కనిష్టానికి పడిపోయాయన్నారు. ఇప్పటికే ఆయన 8.5 కేజీల బరువు తగ్గారన్నారు. ఇక షుగర్ స్థాయిలు 50 కంటే తగ్గతే ఆయన పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆవేదన చెందారు.

Also Read: LokSabha: కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్


దీంతో కేజ్రీవాల్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశముందన్నారు. అంతేకాకుండా బ్రెయిన్ దెబ్బతిడంతోపాటు ఆయన శాశ్వతంగా అనారోగ్యం భారీ పడే పరిస్థితి నెలకొందన్నారు. కేజ్రీవాల్‌.. ఆ విధంగా కావడానికి కారణమెవరవని ప్రశ్నించారు. అందుకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అలాగే వైద్యుల సలహాలు సైతం తీసుకుంటామన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే దేశమే కాదు దేవుడు కూడా క్షమించడని బీజేపీ తెలుసుకోవాలని మంత్రి అతిషి అన్నారు.

Also Read: Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం


ఇటీవల ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆ వెంటనే బీజేపీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి.. ఆ బెయిల్‌ను రద్దు చేయించిందన్నారు. ఆ తర్వాత ఆయన్ని సీబీఐ ఇదే కేసులో అరెస్ట్ చేసిందని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో మంత్రి అతిషితోపాటు వైద్యులు సైతం పాల్గొన్నారు. మద్యం కుంభకోణం కేసులో మని లాండరింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో సీబీఐ సైతం ఆయన్ని అరెస్ట్ చేయడంతో.. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహాడ్ జైల్లోనే ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 14 , 2024 | 07:59 PM