MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడి పొడగింపు.. ఎప్పటి వరకంటే..
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:06 PM
ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను జైలు అధికారులు హాజరుపరిచారు. తదుపరి కేసు విచారణ జూలై 25 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందన్న ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను జైలు అధికారులు హాజరుపరిచారు. తదుపరి కేసు విచారణ జూలై 25 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందన్న ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి. అయితే కవిత.. ఈడీ, సీబీఐ కేసులకు సంబంధించి ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఈ నెల 1న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఒక విద్యావంతురాలిగా పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ కేసులో కవిత పాత్రతో పాటు ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ఆధారంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలా.. వద్దా? అనే నిర్ణయముంటుందని వెల్లడించింది. ఈడీ సేకరించిన సాక్ష్యాలను బట్టి ఢిల్లీలో కొత్త మద్యం విధానం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో కవిత కూడా ఒకరని..ఈ కేసులో మరికొందరు నిందితులు కూడా ఆమె తరఫునే పనిచేశారని తేలిందని హైకోర్టు పేర్కొంది. ఫలితంగా ఆమెను ఓ నిస్సహాయ మహిళగా భావించలేమని కోర్టు స్పష్టం చేస్తూ ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది.