Home » Devineni Umamaheswara Rao
బాబ్లీ ప్రాజెక్ట్ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులో నాటి ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబులకు మహారాష్ట్రలోని బిలోలి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ రెడ్డి(CM Jagan) అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) ఆరోపించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి, కక్షసాధింపులకు పాల్పడి రాబోయే ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తనను దొంగ దెబ్బతీయడానికి సందు గొందుల్లో వైసీపీ నేతలు కాపు కాశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) అన్నారు. సోమవారం నాడు జక్కంపూడి కాలనీలో జరిగిన శంఖారావం సభలో పాల్గొని దేవినేని మాట్లాడుతూ... సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేతలపై ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్(CM Jagan) కు ఎవరిచ్చారు? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ప్రశ్నించారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... జగన్ అఘాయిత్యాల వల్ల అమరావతి రైతులు కొంతమంది జైళ్లకెళ్లగా.. మరికొంతమంది ప్రాణాలర్పించారని చెప్పారు.
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్యాలెస్‌లు వెలిగిపోతుంటే.. పేదల గూళ్ళు కూలిపోతున్నాయన్నారు.
టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉమ్మడి బహిరంగ సభకు ‘జెండా’గా నామకరణం చేశామని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న ఈ సభలో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటిస్తారని చెప్పారు.
ఎన్నికల స్టంట్‌లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు టీడీపీ 87 శాతం పూర్తి చేస్తే మిగిలిన 13 శాతం పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందని అన్నారు.
టీడీపీ సీనియర్లంతా టికెట్ల టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే సీనియర్లను కంగారు పెడుతోంది. పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో యరపతినేని, గురజాలలో జంగా కృష్ణమూర్తి, పెనమలూరులో ఎంఎస్ బేగ్ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గురజాల, పెనమలూరుల్లో వేరే పేర్లతో కూడా సర్వేలు నిర్వహిస్తుండటం దేవినేని, యరపతినేనిల్లో టెన్షన్ మొదలైంది.
తమకూ.. దేవినేని ఉమామహేశ్వరరావుకు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలూ లేవని.. ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదని నేటి నుంచి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలసికట్టుగా పని చేస్తామని దేవినేని వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
టీడీపీ-జనసేన (TDP - Janasean) తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో అలకలు, అసంతృప్తులకు గురైన నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు సీనియర్ నేతలు నేడు (ఆదివారం) చంద్రబాబును కలిశారు. వారిలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఉన్నారు.