Share News

Lightning Strike: విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:48 AM

విద్యుదాఘాతంతో ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు మృతి చెందారు. కృష్ణా జిల్లా, పాడేరు మండలంలో బలమైన మెరుపు తగిలి ఈ విషాదం చోటు చేసుకుంది.

Lightning Strike: విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి

  • మరో ముగ్గురికి గాయాలు

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

కోరుకొండ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలోని మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలోని రైస్‌ మిల్లు వద్ద శనివారం జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానిక గణపతి రైస్‌మిల్లులో శనివారం ధాన్యం లోడు చేసే కన్వర్ట్‌ బెల్ట్‌ను ట్రాలీపై తీసుకువెళుతుండగా సమీపంలో ఉన్న 11కేవీ విద్యుత్‌ వైర్లకు ట్రాలీ చివర భాగం తగిలింది. దీంతో విద్యుత్‌ షాక్‌కు గురై రైసుమిల్లు కార్మికులు ఆకుల శ్రీరాం(నాని)(30), జాజుల వెంకన్న (58), పలసాల సత్యనారాయణ (55) అక్కడికక్కడే మృతి చెందారు.

Updated Date - Apr 13 , 2025 | 04:52 AM