Home » Election Campaign
ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్‌లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. అరెస్టుల ద్వారా ఆప్‌ను నాశనం చేయలేరని, ఆప్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక ఆలోచనాధార అని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలు ముగింపునకు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 14 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి.
గత డెబ్బయి ఏళ్లుగా చేతిలో బాంబులు పెట్టుకొని బెదిరించిన పాకిస్థాన్ ఇప్పుడు భిక్షాపాత్ర పట్టుకొని తిరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. హరియాణాలోని అంబాలాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 13న తెనాలిలో తనను కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కోరారు.
ఏపీలో ఐదేళ్లలో వైసీపీ (YSRCP) నేతలు పెట్రేగిపోయారు. వారు సృష్టించిన అరాచకం, దాడులు అన్ని ఇన్ని కావు. సామాన్యులపై దాడులు చేస్తూ ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారు.
మైలవరం వైసీపీ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. శనివారంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగిసినా.. 144 సెక్షన్ అమల్లో ఉన్నా..
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 2,10,804 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,06, 242 మంది, మహిళలు 1,04, 831 మంది ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు సోమవారం జరుగనున్న ఎన్నికల్లో వా రు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అమరాపురం మండలంలో 46,919 మంది, గుడిబండలో 43,160 మంది, రొళ్ల మండలంలో 30,677 మంది, అగళిలో 26,682 మంది, మడకశిర రూరల్ పరిథిలో 46,432 మంది, మడకశిర అర్బన పరిధిలో 17,204 మంది ఓటర్లు ఉన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో పోలింగ్ సామ గ్రిని ఆదివారం అందజేశారు. పెనుకొండ నియోజకవర్గంలో ని 265 పోలింగ్ కేంద్రాలకు 318 మంది పీఓలు, 318మంది ఏపీఓలు, 1272మంది ఓపీఓలను నియమించారు. వారందరూ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సామ గ్రితో తరలివెళ్లారు. నియోజకకర్గంలో మొత్తం 31 సమస్యాత్మ క కేంద్రాలను గుర్తించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 2132మంది పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరుగనున్న పోలింగ్ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టినట్లు, సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల డీటీ రెడ్డి శేఖర్ తెలిపారు. పట్టణంలోని ఎంజీఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం పో లింగ్ సిబ్బందికి ఈవీఎంలు అందించా రు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా 32 సెక్టార్లలో 253 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 192 కేంద్రాల్లో వెబ్ టెలికాస్ట్కు ఏర్పాటుకు రూపుదిద్దుకుంది.