Share News

POLL : పోలింగ్‌ సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్‌

ABN , Publish Date - May 13 , 2024 | 12:02 AM

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో పోలింగ్‌ సామ గ్రిని ఆదివారం అందజేశారు. పెనుకొండ నియోజకవర్గంలో ని 265 పోలింగ్‌ కేంద్రాలకు 318 మంది పీఓలు, 318మంది ఏపీఓలు, 1272మంది ఓపీఓలను నియమించారు. వారందరూ వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు సామ గ్రితో తరలివెళ్లారు. నియోజకకర్గంలో మొత్తం 31 సమస్యాత్మ క కేంద్రాలను గుర్తించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 2132మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకున్నారు.

POLL : పోలింగ్‌ సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్‌
Collector Arun Babu and Sub Collector Apoorva Bharata inspecting EVMs in Penukonda.

పెనుకొండ టౌన, మే 12 : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో పోలింగ్‌ సామ గ్రిని ఆదివారం అందజేశారు. పెనుకొండ నియోజకవర్గంలో ని 265 పోలింగ్‌ కేంద్రాలకు 318 మంది పీఓలు, 318మంది ఏపీఓలు, 1272మంది ఓపీఓలను నియమించారు. వారందరూ వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు సామ గ్రితో తరలివెళ్లారు. నియోజకకర్గంలో మొత్తం 31 సమస్యాత్మ క కేంద్రాలను గుర్తించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 2132మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,35, 986మంది ఓట ర్లుండగా పురుషులు 1,17, 952, స్ర్తీలు 1,18, 030 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. వారు సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను తరలించామని తెలిపారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అదనంగా రిజర్వ్‌డ్‌ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ అపూర్వభరత తదితరులు పాల్గొన్నారు.

మడకశిర టౌన: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద అదివారం ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదివారం పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందించి, పలుసూచనలు చేశారు. సోమవారం పో లింగ్‌ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఎన్ని కల నియ మావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమస్యాత్మక గ్రామాలలో ఎలాంటి చర్యలు చేపట్టారని అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై ఆర్‌ఓ గౌరీశంకర్‌ను అడిగి తెలుసుకొన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులకు, సిబ్బందికి ఎన్నికల నియమావళిపై సలహాలు, సూచనలు అందజేశారు.


ఎన్నికలు సవ్యంగా సాగాలి : ఎస్పీ

హిందూపురం అర్బన నియోకవ ర్గంలో ఎన్నికలు సజావుగా జరగాలని జి ల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. హిందూ పురం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్ని కల ఏర్పాట్లను ఎస్పీ ఆదివారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, స్ర్టాం గ్‌ రూంలు, డిస్ర్టిబ్యూషన సెంటర్‌లను తనిఖీ చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ భద్రత, ఎన్నికల విధులకు వెళ్లే వారికి రవాణ సౌకర్యాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు, పోలింగ్‌ అధి కారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని డీఎస్పీ కన్జక్షనకు సూచించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 13 , 2024 | 12:02 AM