Home » Election Campaign
అవినీతికి పాల్పడి సం పాదించిన సొమ్ముతో అడ్డగోలుగా ఎన్నికల్లో గెలించేం దుకు ప్రయత్నిస్తున్న మంత్రి ఉషశ్రీని చిత్తుగా ఓడిం చాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె శుక్రవారం సోమందేపల్లి మండలంలోని కొనతట్టు పల్లి, వెలగమాకులపల్లిల్లో విస్తృతస్థాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరించి ఎంపీ అభ్యర్థి బీకే పార్థ సారథికి, తనకు సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధి క మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
అన్ని రకాలుగా వెనుకబ డిన హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరు గులు పెట్టించింది టీడీపీనే అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం చిలమత్తూరు మండలంలో రోడ్‌షో నిర్వహించారు. ఉదయం 7 గంటలకే సోమఘట్ట నుంచి ప్రచారాన్ని ప్రా రంభించారు. ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పా లనలో నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడవేసిన గొంగళి అక్క డే అన్నట్లు మారిందన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం కుప్పం, మంగళగిరికి జగన్ రూ.300 కోట్ల చొప్పున పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ఆరోపణలు చేశారు. పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోవాలని.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్‌లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. కొండలు, గుట్టలు ఎక్కి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. సుజనా ముందు ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. మంచినీరు, డ్రైనేజి, రోడ్ల దుస్థితిని సుజనాకు స్థానికులు వివరించారు.
ఏపీలో పోలింగ్ టైమ్ దగ్గరపడింది. పొరుగూరు అంతా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఊరు నుంచి వచ్చిన ఓటర్ల దగ్గరకు వెళ్లి పార్టీ శ్రేణులు పలకరిస్తున్నారు. ప్రయాణం ఎలా జరిగింది. అంతా కులాశానేనా.. పని ఎలా నడుస్తుంది. ఆరోగ్యం బాగుందా అంతా అప్యాయంగా పలకరిస్తూ.. చివరిలో మన గుర్తు మర్చిపోకు.. మన పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు .
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ సిటీలో పర్యటనకు అధికారులు అడ్డంకులు ఏర్పరిచారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్ షో, సభకు టీడీపీ, జనసేన పార్టీలు దరఖాస్తు చేశాయి. అయితే అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పేర్కొంటూ పవన్ పర్యటనకు అనుమతి నిరాకరించారు.
రాష్ట్రంలో ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన రెక్కలను ఓటుతో విరగ్గొట్టాలని సినీనటుడు నారారోహిత పేర్కొన్నారు. ఆయన గురువారం గుడిబండలో రోడ్‌షో నిర్వహించా రు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్య దర్శి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారారోహిత మాట్లాడుతూ నారాచంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ది చెందుతుందని అన్నారు.
ఐదేళ్ల జగన్మోహనరెడ్డి నియంత పాలన ఇక మూడురోజుల్లో అంతం కాబోతోందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్య ర్థి సవిత, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి పే ర్కొన్నారు. గోరంట్ల పట్టణంలో గురు వారం నిర్వహించిన రోడ్‌షోలో వారితోపాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బీకేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెం డాలు పట్టుకుని, ద్విచక్రవాహనాల్లో హోరెత్తిం చారు. కదిరి రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద నుంచి ప్రధాన రహదారిపై రోడ్‌షో నిర్వహించగా గజ మాల లు వేయడానికి కూటమి నాయకులు పోటీపడ్డారు.
వైసీపీ మరోసారి అధికారం లోకి వచ్చిందంటే ఆస్తులు వదులుకోవాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం హిందూపురం మండలంలోని బేవనహళ్లిలో, పట్టణ పరిధిలోని కొన్ని వార్డుల్లో ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఐదే ళ్లలో వైసీపీ నాయకులు హిందూపురం నియోజకవర్గం లో మాన్యం భూములను కబ్జాచేశారని, ప్రభుత్వ భూ మి ఎక్కడ కనిపించినా అమ్మేశారన్నారు. మరోసారి వైసీ పీ వస్తే మనందరి ఆస్తులు వదులుకుని ఊళ్లు విడచాల్సిందేనన్నారు.