Home » Election Commission of India
అనురాగ్ గుప్తా స్థానంలో కొత్త డీజీపీ నియామకానికి వీలుగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారుల జాబితాను అక్టోబర్ 21వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా జార్ఖాండ్ ప్రభుత్వాన్ని ఈసీఐ ఆదేశించింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితౌరాగఢ్‌లో బుధవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారంనాడు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇదే సమయంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారంనాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఇదే సమయంలో పంజాబ్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారంనాడు సమీక్షించారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్.ఎస్.సంధు తదితరులు పాల్గొన్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు సవరించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ తేదీని అక్టోబర్ 5వ తేదీకి మార్చింది.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో టికెట్ల కేటాయింపు షురూ అయింది. దీంతో పార్టీలోని పలువురు నేతల్లో అసమ్మతి ఎగసి పడుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పొత్తు పెట్టుకుంది. దీంతో పలు సీట్లు కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి తొలి విడత పోలింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇక అభ్యర్థుల నామినేషన్ గడువు ఆగస్ట్ 27వ తేదీతో ముగియనుంది.
జమ్మూ కశ్మీర్లో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జీ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తోపాటు ఆ పార్టీలోని కీలక నేతలు తరుణ్ చుగ్, రవీంద్ర రైనా తదితరులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. అలాగే 80 శాతం మంది కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలో దింపాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తుంది.