Share News

ఫిర్యాదుల నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ బదిలీ

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:02 AM

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ఫిర్యాదుల నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ బదిలీ

  • ఎన్నికల సంఘం ఆదేశాలు.. పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ

ముంబై, నవంబరు 4: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో మరొకరని నియమించేందుకు ముగ్గురు అత్యంత సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను మంగళవారంలోగా పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుజాత సౌనిక్‌కు సూచించింది. అధికార మహాయుతి కూటమికి అనుకూలంగా రష్మీ వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొంది. ఆమె ప్రత్యక్షంగానే బీజేపీ పక్షాన పనిచేస్తున్నారని, విపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ చేసి ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీ్‌సకు సమాచారం అందిస్తున్నారని శివసేన (ఠాక్రే) నేత సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఝార్ఖండ్‌ డీజీపీని బదిలీ చేసినట్టుగానే ఆమెను కూడా మార్చాలని డిమాండు చేశారు. 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి అయిన రష్మీ శుక్లా మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా గుర్తింపు పొందారు.

Updated Date - Nov 05 , 2024 | 04:02 AM