Home » Election Commission
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయమే జనం భారీగా తరలివచ్చారు. అధికార వైసీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళన కలిగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్ పూర్తి అయి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారన్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో భారీ సంఖ్యలో క్యూలైన్లో ఓటర్లు ఉన్నారన్నారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కొంత ఆలస్యమైందని తెలిపారు.
Andhrapradesh: పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఆరా తీసిన ఈసీ.. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది నిమిషాలే సమయం ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధఇకారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా.. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారు. అయితే పోలింగ్ ప్రారంభకాకముందే కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి.
Telangana: ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల పహారా నడుమ పోలింగ్ కొనసాగనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. రానున్న ఐదేళ్లు తమ భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధిని నిర్దేశించే పాలకులను ఎంపిక చేసుకొనేందుకు ఓటు ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు.
కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా, మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులను విధుల్లో నియమించారు.
రేపటి పోలింగ్‌పై పార్టీ కేంద్ర కార్యాలయంలోని వార్ రూం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం సమీక్ష చేశారు. పార్టీ అఫీస్‌లోని వార్ రూం నుంచి జిల్లాల్లోని పార్టీనేతలతో సమీక్షించారు.
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ కేతన గార్గ్ తెలిపారు. పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి అప్పగించే బాధ్యతలను రిటర్నింగ్ అధికారి, జేసీ ఆధ్వర్యంలో సమర్పించారు.