AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’
ABN , Publish Date - May 14 , 2024 | 02:15 PM
Andhrapradesh: ఓట్ల పండగ కోసం ఏపీకి ప్రజలు ఏ విధంగా తరలివచ్చారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ శాతం కూడా అధికంగా నమోదు అయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు బస్సుల్లో, రైళ్లల్లో సొంత వాహనాల్లో రెండు రోజుల ముందే తమ గ్రామాలకు తరలివచ్చారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు రైలులో వస్తున్న వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైలు కోసం తొలిసారిగా ‘‘గ్రీన్ ఛానల్’’ను ఏర్పాటు చేశారు.
అమరావతి, మే 14: ఓట్ల (AP Elections 2024) పండగ కోసం ఏపీకి (Andhrapradesh) ప్రజలు ఏ విధంగా తరలివచ్చారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ శాతం కూడా అధికంగా నమోదు అయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు బస్సుల్లో, రైళ్లల్లో సొంత వాహనాల్లో రెండు రోజుల ముందే తమ గ్రామాలకు తరలివచ్చారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు రైలులో వస్తున్న వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైలు కోసం తొలిసారిగా ‘‘గ్రీన్ ఛానల్’’ను (Green Channel) ఏర్పాటు చేశారు. నాందెడ్ - విశాఖ మధ్య నడిచే రైలు కోసం సీఈవో కార్యాలయం గ్రీన్ ఛానల్‌లు ఏర్పాటు చేయించింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మొదటి సారి ఓటు కోసం ట్రెయిన్‌కు గ్రీన్ ఛానల్ వెసులుబాటు కల్పించారు.
Loksabha Elections 2024: సౌత్‌లో బీజేపీ బలపడిందా..?
ట్రెయిన్‌ను పోలింగ్ సమయానికి ముందే విశాఖపట్నానికి (Visakhapatnam) చేర్చే విధంగా ఎన్నికల సంఘం, రైల్వే శాఖల మధ్య సంప్రదింపులు జరిగాయి. అడిషనల్ సీఈవో కోటేశ్వరరావు (Additional CEO Koteswara Rao).. రైల్వే శాఖతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమన్వయం చేశారు. కోటేశ్వరరావు కృషితో దాదాపు 2000 మంది ఓటర్లకు ఓటు హక్కు లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావు కృషిపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..
Indigo Flight: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిన ఇండిగో విమానం...
Read Latest AP News And Telugu News