Home » Elections
మోదీ 3.0 సర్కారు కొలువు తీరే వేళయింది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశ రాజధాని అసాధారణ రీతిలో అప్రమత్తమైంది. ప్రమాణ స్వీకార వేదిక అయిన రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని ..
ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.
2019 లోక్ సభ ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల(Transgenders) ఓటింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం డేటా తెలియజేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో 14.58 శాతం మాత్రమే పోల్ కాగా 2024 ఎన్నికల్లో ఇది 25 శాతంగా ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలోనే హిందూపురం వాణిజ్య కేంద్రానికి పెట్టిందిపేరు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో ఉంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో అపారమైన వనరులున్నాయి. ఎలాగైనా నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని పెద్దాయన యోచించాడు.
గ్రేటర్లో నాలుగు డివిజన్లు ఖాళీ అయ్యాయి. రెండు స్థానాల్లో కార్పొరేటర్లు మరణించగా.. ఓ కార్పొరేటర్ ఎమ్మెల్సీగా, మరో కార్పొరేటర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు(By-elections) జరగాల్సి ఉంది. గుడిమల్కాపూర్ నుంచి బీజేపీ(BJP) తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన దేవర కరుణాకర్ 2023 జనవరిలో అనారోగ్యంతో మరణించారు.
గ్రేటర్లో ఎట్టకేలకు కాంగ్రెస్ బోణీ కొట్టింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) సీటును హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థిపై ఎన్.శ్రీగణేష్ ఘన విజయం సాధించారు.
అమరావతి: 2024 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గల్లంతైపోయింది. సీఎం జగన్, పెద్దిరెడ్డి మినహా వైసీపీలోని హేమా హేమీలందరూ ఓటమిపాలయ్యారు. మంత్రులు, మాజీ మంత్రులు డిప్యూటీ సీఎంలు ఓటమిపాలయ్యారు. ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, జగన్‌పై వ్యతిరేకత ప్రతిఫలించింది.
ఖమ్మం జిల్లా: రూరల్ మండలం పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఖమ్మం పార్లమెంట్ కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఖమ్మం లోక్ సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అబ్జర్వర్లు ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేశారు.
దేశప్రజల నిరీక్షణ మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే(Lok Sabha Elections 2024) అందరి దృష్టి ఉంది. జూన్ 1న ముగిసిన లోక్‌సభలోని 543 స్థానాలకు 7 దశల్లో ఓటింగ్ పూర్తైంది.
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(SKM) పార్టీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 32స్థానాల్లో 30స్థానాలకు ట్రెండ్ వెల్లడైంది. 29స్థానాల్లో ఎస్కేఎం, 1స్థానంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.