ITR Filing 2025: ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..
ABN , Publish Date - Apr 03 , 2025 | 02:09 PM
How to file ITR without Form 16: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల జీతం నుంచి ఎంత (TDS) కట్ అయింది, సబ్మిషన్ డేట్ రుజువు చేసే పత్రమే ఫారం 16. ఉద్యోగి పనిచేసే సంస్థ జారీ చేసే ఈ సర్టిఫికేట్‌లో కచ్చితమైన ఆదాయం, పన్ను వివరాలు ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేసేటప్పుడు దీన్ని సమర్పిస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు.

How to file ITR without Form 16: ఈ నెల ఏప్రిల్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు 2025-26 అసెస్‌మెంట్ ఇయర్ (AY) కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేయడం ప్రారంభించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు వారి యాజమాన్య సంస్థలు ఫారమ్ 16ను అందిస్తాయి. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరం (FY)లో ఉద్యోగులు అందుకున్న జీతం, మూలం వద్ద పన్ను(TDS) ఇతర కీలక ఆర్థిక సమాచారం ఉంటుంది. ITR దాఖలు ప్రక్రియ ఇప్పటికే మొదలుకావడంతో ఫారం-16 లేదని కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతుంటారు. కానీ, ఉద్యోగులు పారం-16 లేకపోయినా నిశ్చింతంగా ఐటీఆర్ ఫైలింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది.
ఫారం 16 అంటే ఏమిటి?
ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు వారి యాజమాన్య కంపెనీలు ఫారం 16 ను అందిస్తాయి. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి సంపాదించిన జీతం, టీడీఎస్ (TDS) వివరాలు, పన్ను మినహాయింపులు ఉంటాయి. ఈ సర్టిఫికేట్ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఉద్యోగుల ఆదాయం, పన్నులకు సంబంధించిన కచ్చితమైన నివేదికే ఫారం-16. కానీ, పన్ను మినహాయింపు పరిమితికి మించి ఆదాయం లేని ఉద్యోగులకు వారు పనిచేసే కంపెనీలు ఫారం-16 ఇవ్వవు.
ఫారం 16లో రెండు ప్రధాన భాగాలు
PART A: యజమాని, ఉద్యోగి సమాచారం, PAN, TAN, TDS తగ్గింపులు వంటి ముఖ్యమైన వివరాలను కలిగి ఉంటుంది.
PART B: ఉద్యోగి జీతం, పన్ను విధించదగిన ఆదాయం, సెక్షన్లు 80C, 80D కింద ఉన్న తగ్గింపుల వివరాలను చూపిస్తుంది. ఎంత ఆదాయానికి పన్ను విధించాలనో లెక్కించేందుకు సహాయపడుతుంది.
ఫారం 16 ఎందుకు ముఖ్యం?
ఫారం 16 మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు ప్రక్రియను సులభతరం చేస్తుంది. అవసరమైన ఆదాయం, పన్ను వివరాలను ఒకే చోట అందిస్తుంది. బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆదాయ రుజువుగా కూడా ఫారం 16ను దీన్ని సమర్పించవచ్చు. ఒకవేళ మీ జీతం నుంచి ఎక్స్ ట్రా TDS కట్ అయితే ఫారం 16 పన్ను వాపసును సజావుగా క్లెయిమ్ చేయడంలో ఉపయోగపడుతుంది.
ఫారం 16 లేకుండా ITR ఫైల్ ఎలా చేయాలి?
ముందుగా ఆర్థిక సంవత్సరంలో అన్ని నెలల శాలరీ స్లిప్‌లను ఒక చోట చేర్చండి. ఇవి మీ ఆదాయాలు, భత్యాలు, తగ్గింపుల వివరాలను అందిస్తాయి. మీ ఆదాయాన్ని సరిగ్గా నివేదించేందుకు సహాయపడతాయి.
జీతం, అలవెన్సులు (HRA, LTA, ప్రత్యేక అలవెన్స్), బోనస్‌లు, పెర్క్‌లను జోడించండి. తర్వాత, పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించడానికి ప్రామాణిక తగ్గింపు (రూ. 50,000), HRA, వృత్తిపరమైన పన్ను వంటి తగ్గింపులను తీసివేయండి. పాత పన్ను విధానానికే ఈ తగ్గింపులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. కొత్త పన్ను విధానం రూ. 75,000 ప్రామాణిక మినహాయింపు పొందవచ్చు.
వడ్డీ లేదా డివిడెండ్ వంటి ఏదైనా అదనపు ఆదాయం కోసం మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేయండి. వాటిని మీ మొత్తం ఆదాయానికి జోడించండి.
పాన్ కార్డుకు లింక్ చేసిన పన్ను మినహాయింపులు, డిపాజిట్లను తనిఖీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుండి ఫారం 26AS ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇవి మీ ఆదాయం, TDS వివరాలతో సరిపోలుతున్నాయో లేదో నిర్ధారించుకోండి. ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే మీ యాజమాన్య కంపెనీ లేదా బ్యాంకును సంప్రదించండి.
Read Also: Rent House Probles: అద్దె ఇంట్లో ఉంటున్నారా ఈ పొరపాటు చేస్తే మీ కొంప కొల్లేరే
Stock Market Opening Bell: భారీ నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Lays Offs: ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి