Share News

Chennai: ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:55 PM

ఎన్‌కౌంటర్‌లో ఓ రౌడీ హతమయ్యాడు. పలు దోపిడీలు, అక్రమాలకు పాల్పడ్డ ఆ రౌడీ చివరకు పోలీస్ తూటాకు బలయ్యాడు. విజయ్ అనే రౌడీ మూడు జిల్లాల్లో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. అలాగే అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి.

Chennai: ఎన్‌కౌంటర్‌లో రౌడీ హతం

- లారీ డ్రైవర్‌ వద్ద దోపిడీ వ్యవహారం..

చెన్నై: లారీ డ్రైవర్ల వద్ద నగదు దోచుకుంటున్న రౌడీ విజయ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌(Encounter)లో హతమయ్యాడు. పుదుచ్చేరి-నాగపట్టణం జాతీయ రహదారిపై ప్రతిరోజు వందలాది సరుకు వాహనాలు వెళ్తుంటాయి. ఎం.పుదూర్‌ ప్రాంతంలో వాహనాలను అడ్డుకుంటున్న ఓ ముఠా డ్రైవర్ల నుంచి మామూళ్లు ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో, పుదుచ్చేరి నుంచి మైలాడుదురై వెళ్తున్న లారీని అడ్డుకొని, డ్రైవర్‌ కాళిముత్తుపై కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్‌(Cell Phone), నగదు దోచుకున్న ఓ ముఠా పరారైంది.

ఈ వార్తను కూడా చదవండి: కులాంతర వివాహానికి సిద్ధమైందని.. సోదరినే చంపేశాడు


అలాగే, మరో లారీ డ్రైవర్‌ మణిమారన్‌పై కూడా ఆ ముఠా కత్తితో దాడిచేసి నగదుతో ఉడాయించారు. ఈ ఘటనల్లో గాయపడిన ఇద్దరు డ్రైవర్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, పరారైన ముఠా కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో, కడలూరు(Kadaluru) జిల్లాలో డ్రైవర్లపై కత్తితో దాడిచేసిన వారిలో విజయ్‌ అలియాస్‌ ముట్టై విజయ్‌ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి అతడిని చుట్టుముట్టారు.


nani3.jpg

విజయ్‌ కత్తితో పోలీసులతో దాడిచేయడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత కూడా విజయ్‌ కత్తితో బెదిరిస్తూ పారిపోయేందుకు యత్నించడంతో, పోలీసుల కాల్పుల్లో అతను మృతిచెందాడు. మృతుడు విజయ్‌పై పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం తదితర జిల్లాల్లో హత్యాయత్నం, దోపిడీ సహా 30కి పైగా కేసులున్నాయి. అలాగే, ఈ వ్యవహారంలో పోలీసులు మరో ఐదుగురిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శాంతికి మేం సిద్ధం!

కొత్త తల్లులు గిల్ట్‌ లేకుండా..

Sangareddy: రాతి గుండె తల్లి

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2025 | 12:55 PM