Home » EVM Machine
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లలో 90 శాతం హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) రూపొందించినవే.
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను తీసుకువెళుతోన్న బస్సు అగ్నిప్రమాదానికి గురవడంతో నాలుగు ఈవీఎంలు పాడయ్యాయి.
ఓట్ల పండుగ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పండుగ ఎన్నికలు.. ఏడు దశల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎంతోమందికి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఓటర్లకు సహజంగా వచ్చే అనుమానాలు కొన్ని అయితే.. ఈవీఎంలపై రాజకీయ పార్టీల ఆరోపణలతో మరిన్ని అనుమానాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఈవీఎం ఎలా పనిచేస్తుంది. మనం వేసిన ఓటు వేసిన పార్టీకే పడుతుందా.. వేరు పార్టీకి పడుతుందా..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) సమయం దగ్గరపడింది. సమయం లేదు మిత్రమా అంటూ అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశం ములుచుకుని అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ఇదలా ఉంచితే.. పోలింగ్ రోజు ఓటర్లకు లెక్కలేనన్ని అనుమానాలు వస్తుంటాయ్. అసలు ఓటు పడిందా..? లేదా..? ఒకవేళ ఓటు పడిందనుకో తాము వేసిన పార్టీకే పడిందా లేదా.. క్రాస్ అయ్యిందా..? ఇలా చాలా అనుమానాలే వస్తుంటాయ్. అయితే.. ఈవీఎంలో మనం ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు.