Home » Fire Accident
వైజాగ్ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్టేషన్లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్లో (Korba - Visakhapatnam Express ) ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది...
వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి సెల్లార్లోని బ్యాటరీల మెయింటనెన్స్ గదిలో విద్యుత్ షార్ట్ సర్యూట్ అయ్యింది. దీంతో సెల్లార్ సహా మెుదటి అంతస్తు వరకు పొగ వ్యాపించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరెట్లో ఫైళ్ల దహనం కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడే సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనేది తేల్చే పనిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కుటుంబంపైనే పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా స్పందించారు...
ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో పెనువిషాదం నింపింది. మంటల్లో తీవ్రంగా గాయపడిన తండ్రి, పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ చనిపోగా.. భార్య, చిన్న కుమార్తె, మరో ఇద్దరు మహిళలు మృత్యువుతో పోరాడుతున్నారు.
Andhrapradesh: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్, సీఎంవో, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం.
తాము ఏదైనా ప్రమాదంలో ఉన్నామని సంకేతాలు అందితే చాలు.. వెంటనే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. మిగతా వాళ్ల గురించి పట్టించుకోకుండా.. తాము సురక్షితంగా బయటపడ్డామా? లేదా?
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS)లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు(Boiler Explosion) చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Minister Vasamshetty Subhash), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.
వరస బాయిలర్ పేలుడు(Boiler Explosion) ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా(NTR District) దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవకముందే ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) ఐదవ యూనిట్ బాయిలర్లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి.