Home » Gaddar
Gaddar Award: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కళాకారులకు ఇచ్చే నందీ అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును ఇక నుంచి గద్దర్ అవార్డుగా అందజేయడం జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana: తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. బుధవారం సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజాయుద్ధనౌక గద్దర్ సమాధి వద్దకు భట్టి చేరుకుని నివాళులర్పించారు.
ప్రజా యుద్ధనౌక గద్దరన్నను కూడా లోపలికి రానీయకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) ఎర్రటి ఎండలో బయట నిలబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు గద్దర్ కుమార్తె వెన్నెల తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తన తల్లితో కలిసి వెన్నెల మీడియాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నాను. కానీ టికెట్ ఇవ్వకపోయినా
ప్రజాకవి గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ మృతి తెలుసుకుని చాలా బాధపడినట్లు తెలిపారు.
పాలెగాడి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌ను మించిన ఉదాహరణ ఉండదేమో! రాయలసీమలో అరాచకాలు సృష్టించిన పాలెగాళ్లలోని పోకడలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM JAGAN)లో కనిపిస్తున్నాయి.
‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..! నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసింది..!
ఇటివలే కన్నుమూసిన గద్దర్‌ను భయం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మంగళవారం గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన ఘటనపై స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు, కళాకారులకు ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డులు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి((Revanth Reddy)) అన్నారు. శనివారం నాడు బోయినపెల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ ప్రచార సభ నిర్వహిచింది.