Share News

రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:38 AM

ఈ రోజు మంచి రోజు.. రిజిస్ట్రేషన్‌ చేయిద్దాం.. అవసరమైన డబ్బు సమకూరింది ఇల్లు, భూమి రిజిస్ట్రేషన్‌ చేసేద్దాం.. చాలామంది ఇలాగే ఆలోచిస్తారు. రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే తక్షణం పని పూర్తయ్యేది.

రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌

నూతన విధానానికి ప్రభుత్వ శ్రీకారం

తొలుత జిల్లా కేంద్రం నుంచే అమలు

త్వరలో అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో..

రిజిస్ట్రేషన్‌ ఎప్పుడనేది ముందుగానే నిర్ధారణ

పూర్తి పారదర్శకత.. జాప్యం నివారణ

దళారులు, సిఫార్సులకు చెక్‌

అందరికీ అందుబాటులో సేవలు

ఈ రోజు మంచి రోజు.. రిజిస్ట్రేషన్‌ చేయిద్దాం.. అవసరమైన డబ్బు సమకూరింది ఇల్లు, భూమి రిజిస్ట్రేషన్‌ చేసేద్దాం.. చాలామంది ఇలాగే ఆలోచిస్తారు. రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే తక్షణం పని పూర్తయ్యేది. కొంతమంది గంటల తరబడి, రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చేది. ఈ పద్ధతికి శుక్రవారం నుంచి తెరపడనుంది. స్లాట్‌ బుకింగ్‌ విధానం అమల్లోకి రానుంది. ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్‌లో ముందుగా నమోదు చేసుకుంటే ఏ రోజు, ఏ సమయంలో రిజిస్ట్రేషన్‌ అవుతుందనేది నిర్ధారణ అవుతుంది. సూచించిన రోజునే రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళితే ఇట్టే పని పూర్తవుతుంది. మిగతా శాఖల మాదిరిగానే రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలో కూడా వినూత్న మార్పులకు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

రిజిస్ట్రేషన్‌ – స్టాంపులశాఖలో ప్రభుత్వం వినూత్న మార్పుల కు శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్‌ నిమిత్తం వచ్చే వారికి సకల సౌకర్యాలు సమకూర్చాలని, ఎటువంటి లోటు రాకూడదని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఇంతకుముందే ఆదేశించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ విభాగంలో ఎక్కడా జాప్యానికి తావులేదని అధికారులకు సున్నిత హెచ్చరికలు జారీ చేశారు. ఈ శాఖలో మార్పులు, చేర్పులకు మరో అడుగు ముందుకేశారు. జిల్లా కేం ద్రాల్లో శుక్రవారం నుంచి ఇక రిజిస్ట్రేషన్లు స్లాట్‌ బుకింగ్‌ విధానంలోనే కొనసాగుతాయి. మిగతా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాల్లో అతి త్వరలో అమలు చేస్తారు. స్లాట్‌ బుకింగ్‌లకు డిజిటల్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీక్యూఎంఎస్‌) పాటి స్తారు. ఇప్పటికే అంచెలంచెలుగా వస్తున్న మార్పులకు అనుగు ణంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే కక్షిదారులకు కూడా నూతన విధా నంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ స్లాట్‌ బుకింగ్‌ విధానంపై అనేక మందికి పలు సందేహాలు లేకపోలేదు. ఇంతకుముందు మంచి, చెడ్డా ముహు ర్తాలు చూసుకుని రిజిస్ట్రేషన్లు చేసేవారు. మంచి ముహూర్తం ఉన్న రోజు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అర్ధరాత్రి వరకు పని చేసేవి. కానీ స్లాట్‌ బుకింగ్‌ విధానం అనంతరం అటు కక్షిదా రులు, ఇటు రిజిస్ట్రేషన్‌ సిబ్బందికి కష్టాలు తొలగనున్నాయి.

స్లాట్‌ బుకింగ్‌ ఎలా..

పబ్లిక్‌ డేటా ఎంట్రీ (పీడీఈ) పద్దతి ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ ట్ఛజజీట్టట్చ్టజీౌుఽ.్చఞ.జౌఠి.జీుఽలో చేసుకోవచ్చు. క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేయడానికి ప్రతీ సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. స్లాట్‌ విధానం తొలుత ఆరంభమైంది కాబట్టి అనుమానాలు, సందేహాలుంటే తక్షణం అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకోవాల్సి ఉంది.

రేపటి నుంచే నూతన విధానం

రిజిస్ట్రేషన్స్‌లో స్లాట్‌ బుకింగ్‌ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. తొలి దశలో జిల్లా కేంద్రాల్లోనే ఈ విధానం అమలు చేస్తారు. ఏలూరు జిల్లా కేంద్రంలో అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కక్షిదారులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. తొలుత తడబాటు ఉన్నా తక్షణం సరిదిద్దుకో డానికి సిద్ధపడుతున్నారు.

నూతన విధానంలో ప్రయోజనాలు..

స్లాట్‌ బుకింగ్‌ విధానంతో రిజిస్ట్రేషన్ల కష్టాలకు తెలుగు దేశం ప్రభుత్వం తెరదించబోతోంది. సేవల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా కక్షిదారులు మెరుగైన సేవలు పొందవచ్చు.

స్లాట్‌ బుకింగ్‌ ద్వారా అపాయిమెంట్‌ తేదీ, సమయాన్ని కూడా ముందే తెలుసుకోవచ్చు.

నిర్దేశిత తేదీ, సమయంలో ఎటువంటి హడావుడి లేకుండా రిజిస్ట్రేషన్‌ పని పూర్తి చేసుకోవచ్చు.

రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో గంటల తరబడి వేచి ఉండటం, ఆందోళన చెందడం ఇక కనిపించదు.

కొనుగోలుదారులు, అమ్మకం దారులు, సాక్షులు తగిన సమయంలోనే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు చేరుకోవడానికి వీలు కలగనుంది.

పారదర్శకతతో మధ్యవర్తుల ప్రభావానికి తెరపడనుంది.

అనధికారిక కార్యకలాపాలు, అవినీతికి చెక్‌ పెట్టినట్లే.

తిరస్కరణలు నివారించడానికి కొత్త విధానం మేలు.

Updated Date - Apr 03 , 2025 | 01:38 AM