Share News

మహిళా సంఘాలకు గ్రేడింగ్‌

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:48 AM

జగిత్యాల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక మహిళా సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తోంది. మహిళలకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. సంఘాల్లో సభ్యులు అనుభవ మున్న రంగంలో రాణించేలా ప్రత్యేక రుణాలు మంజూరు చేస్తున్నారు. అందుకే మహిళా సంఘాల్లో చాలా మంది సభ్యులుగా చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మహిళా సంఘాలకు గ్రేడింగ్‌

-పాయింట్ల ఆధారంగా రుణాల్లో ప్రాధాన్యం

-పెరిగిన అధికారుల పర్యవేక్షణ

-జిల్లాలో 1,73,412 మంది మహిళా సంఘాల సభ్యులు

జగిత్యాల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక మహిళా సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తోంది. మహిళలకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. సంఘాల్లో సభ్యులు అనుభవ మున్న రంగంలో రాణించేలా ప్రత్యేక రుణాలు మంజూరు చేస్తున్నారు. అందుకే మహిళా సంఘాల్లో చాలా మంది సభ్యులుగా చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుతో పాటు స్త్రీ నిధి రుణాలు సైతం అందుతుండటంతో ఆర్థిక సమస్యలను అధిగమించే దిశగా మహిళా సంఘాల సభ్యులు ముందుకు సాగుతున్నారు. ఈ సంఘాలను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో గ్రేడింగ్‌ విధానాన్ని సైతం అమలు చేస్తోంది. మహిళలకు గ్రేడింగ్‌ పెరిగే కొద్ది రుణాలకు ఎక్కువగా ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. మహిళా సంఘం సభ్యులు సమావేశాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ఫొటోలను జత చేయాల్సి ఉంటుంది. ఏ గ్రేడ్‌ నుంచి ఈ గ్రేడ్‌ వరకు పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లాలో మొత్తం సుమారు 1,73,412 మంది సభ్యులు ఉండగా గ్రేడ్‌ల ఆధారంగా రుణాలను అందిస్తున్నారు. మహిళా సంఘాలకు ఒక్కో యూనిట్‌ విలువను రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిర్ణయించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఫఅంశాల వారీగా గ్రేడ్లు

మహిళా సంఘాలకు 12 అంశాల ఆధారంగా ఏ, బీ, సీ, డీ, ఈ లతో గ్రేడింగ్‌ ఇస్తారు. ఒక్కో మహిళా సంఘం 75 శాతానికి పైగా గ్రేడింగ్‌ను సాధిస్తే ఎక్కువ సంఖ్యలో రుణాలిస్తారు. ఇలా తక్కువ వడ్డీకి ఇచ్చిన రుణాలను వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 75 శాతానికి పైగా లక్ష్యాలను సాధిస్తే ఏ గ్రేడ్‌, 70 శాతం నుంచి 74 శాతం వరకు బీ గ్రేడ్‌, 60 లోపు సాధిస్తే సీ గ్రేడ్‌ , 50 శాతం వరకు ఉంటే డీ గ్రేడ్‌ అంతకంటే తక్కువగా ఉంటే ఈ గ్రేడింగ్‌ ఇస్తారు. ఏ, బీ, సీ గ్రేడింగ్‌ సంఘాలకు స్ర్తీనిధి రుణాలను కేటాయిస్తారు. గ్రామైక్య సంఘాలకు మాత్రమే ఈ గ్రేడింగ్‌ విధానం అమలులో ఉంది.

కేటాయించే విధానం

ఫ ప్రతీ నెల నిర్వహించే రెండు సమావేశాలకు సభ్యులందరూ హాజరుకావాలి.

ఫసక్రమంగా స్త్రీ నిధి రుణ వాయిదాలు చెల్లించాలి.

ఫ ప్రతినెల పొదుపు చెల్లింపులు ఉండాలి.

ఫ గ్రామ సంఘానికి, బ్యాంకులకు కట్టే రుణ వాయిదాల సకాలంలో చెల్లించాలి.

ఫ వీటన్నింటికి తగిన మార్కులను కలిపి గ్రేడింగ్‌ నిర్ణయిస్తారు.

మహిళా సంఘాల పర్యవేక్షణ పెరుగుతోంది

-రఘువరన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

మహిళా సంఘాల్లో గ్రేడింగ్‌ విధానం అమలు చేయడంతో పొదుపు సంఘాలపై పర్యవేక్షణ పెరుగుతోంది. సమావేశాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు లైవ్‌ పొటోలను అప్‌లోడ్‌ తప్పనిసరిగా చేయాలి. ఎప్పటికప్పుడు అధికారులు సంఘాల వారీగా నివేదికలను తీసుకొని సమీక్ష చేస్తున్నారు.

జిల్లా వివరాలు ఇలా..

------------------------------------------------------------------------------------------

మొత్తం మండలాలు...20

స్వయం సహాయక మహిళా సంఘాలు..14,964

సభ్యులు...1,73,412

గ్రామైఖ్య మహిళా సంఘాలు..565

మండల సమాఖ్య సంఘాలు...18

జిల్లా సమాఖ్య సంఘం...1

------------------------------------------------------------------------------------------

Updated Date - Apr 03 , 2025 | 01:48 AM