Home » Heavy Rains
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మత్రం భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అయితే ఈ వానలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురువనున్నట్లు భారత వాతావరణ చెన్నై ప్రాంతీయ కేంద్రం అధికారులు ప్రకటించారు. దీంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని 12 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సచివాలయంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Heavy rains in Telugu States: అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే తెలంగాణలో సైతం అల్పపీడన ప్రభావం కన్పిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, లక్షద్వీప్ ప్రాంతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులు స్వల్ప వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా Rain Alert To Telangana: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Rains In AndhraPradesh: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు సూచించింది.
బంగాళాఖాతంలో ఆంధ్రా కోస్తాతీరం దిశగా వెళ్ళి, తీరం దాటకుండా రాష్ట్రం వైపు మళ్ళిన అల్పపీడనం ప్రస్తుతం డెల్టాజిల్లాల వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి బంగాళాఖాతంలో ప్రవేశించి రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల దిశగా కదిలింది.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఆంధ్రా కోస్తాతీరంవైపు మళ్ళిన బలమైన అల్పపీడనం తన దిశ మార్చుకుని చెన్నై(Chennai) వైపు కదలుతోందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అల్పపీడనం మధ్య, పడమటి, నైరుతి దిశగా కదులుతోందని, దాని ప్రభావంతో మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఈ నెల 25, 26 తేదీల్లో సముద్రతీర జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
Andhrapradesh: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని.. వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతోందని తెలిపారు. రాగల 24 గంటల్లో వాయుగుండం బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఉత్తరకోస్తా జిల్లాల్లో చెదురు మధురుగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.