Share News

Rains: 25నుంచి మళ్లీ కుండపోత వర్షాలు..

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:27 PM

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఈ నెల 25, 26 తేదీల్లో సముద్రతీర జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

Rains: 25నుంచి మళ్లీ కుండపోత వర్షాలు..

చెన్నై: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఈ నెల 25, 26 తేదీల్లో సముద్రతీర జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్య, పడమటి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం గంటకు 7 కి.మీ.ల వేగంతో తీరం వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. అల్పపీడనం కారణంగా తీర ప్రాంతాల్లో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ఈనెల 23న వరకు జాలర్లు చేపలవేట మానుకుంటేనే మంచిదన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: తల్లిదండ్రులకు చెబుతా అనడంతో...


nani1.2.jpg

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పుదుకోట, శివగంగ, మదురై(Pudukkottai, Sivaganga, Madurai) తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం పూర్తిగా బలహీనపడిన తర్వాత వాయుగుండంగా రూపుదిద్దుకుని తీరం వైపు పయనించనుందన్నారు.


nani1.3.jpg

దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీలలో సముద్రతీర జిల్లాలో పలుచోట్ల కుండపోతగా, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈశాన్య రుతుపవనాలు వచ్చే జనవరి మొదటివారం దాకా కొనసాగుతాయని, జనవరి 10 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని అధికారులు అంచనా వేశారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మానవత్వం లేదా ?

ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్ తేల్చుకుందాం.. కేటీఆర్ సవాల్

ఈవార్తను కూడా చదవండి: అల్లు అర్జున్‌‌ వ్యాఖ్యలపై ఊహించని పరిణామం

ఈవార్తను కూడా చదవండి: ‘సత్వా ఎలిగ్జిర్‌’లో భారీ అగ్ని ప్రమాదం

Read Latest Telangana News and National News


Updated Date - Dec 22 , 2024 | 01:27 PM