Home » Hemanth Soren
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం రాంచీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ ర్యాలీలో కూటమిలోని 14 మంది నాయకులు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత తదితరులు ఈ మెగా ర్యాలీకి హాజరవుతున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీలో ఈ రోజు బలపరీక్ష జరగనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు.
జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది.
జార్ఖండ్(Jharkhand) సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) రాజీనామా, అరెస్ట్ తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో జేఎంఎం(JMM), కాంగ్రెస్(Congress) పార్టీలు తలమునకలయ్యాయి.
జార్ఖాండ్‌ను కుదిపేస్తున్న భూ ఆక్రమణల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మనీల్యాండరింగ్ కోణంలో ప్రశ్నించేందుకు తొమ్మిది సార్లు నోటీసులు పంపించినా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించకపోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం పదవితో పాటు జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.