Home » HYDRA
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీజీ-ఆగ్రోస్) కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి..!
గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు.
రాజధాని హైదరాబాద్లో హైడ్రా మరోసారి యంత్రాలకు పనిచెప్పింది. చెరువుల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపింది. మణికొండ మునిసిపాలిటీ పరిధి నెక్నాంపూర్ పెద్ద చెరువులో నిర్మాణంలో ఉన్న విల్లాలను శుక్రవారం నేలమట్టం చేసింది.
HYDRA: నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన నాలుగు విల్లాలను నేలమట్టం చేసిన హైడ్రా సిబ్బంది.. మరో ఐదు విల్లాలను కూల్చివేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే నెక్నాంపూర్ చెరువును కబ్జా చేయడంతో గతంలో రెవన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేశారు. మూడు సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయి.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాన హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
HYDRA: ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి హైడ్రా చీఫ్ ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి నిర్వాహణ ఉండనుంది. ఫిర్యాదుకు సంబంధిత ఆధారాలతో వస్తున్న ప్రజలు.. దాన్ని హైడ్రా చీఫ్కు అందజేస్తున్నారు.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్ పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా ఝళిపించింది.
Ranganath: అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్లో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వేలాది మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఈ హాస్టల్స్లో ఉంటున్నారని అన్నారు. ఈ హాస్టల్స్ వల్ల ప్రతీ రోజూ అయ్యప్ప సొసైటీలో డ్రైనేజ్, సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతుందని చెప్పారు.
తెలంగాణ: మాదాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. అయ్యప్ప సొసైటీలో నిబంధలకు విరుద్ధంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు.