MP Etala: ఎంపీ ఈటల స్ట్రాంగ్ వార్నింగ్.. ఇళ్లను కూల్చడం ఆపకపొతే ఖబడ్దార్
ABN , Publish Date - Jan 19 , 2025 | 12:55 PM
గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు.

- రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డ ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతినగర్(Arundhati Nagar)లో పర్యటించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు అరుంధతినగర్‌లో కూలగొట్టిన ఇళ్లను పరిశీలించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూ.5 లక్షలివ్వండి.. రూ.10 లక్షలిస్తా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కూల గొట్టడమే అజేండాగా పెట్టుకుందని అరోపించారు. జవహర్‌నగర్(Jawaharnagar)లో పేదకుటుంబాలే నివాసం ఉంటున్నాయని ఇక్కడ కూల్చిన రేకుల షెడ్లకు రూ.50 వేలు, స్లాబ్‌లకు రూ,2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెద్దవాళ్లు కోట్లాది విలువైన భూములను కొల్లగొడుతుంటే పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం జవహర్‌నగర్(Jawaharnagar)లోని పేదలపై మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నారని విమర్శించారు.
రెవెన్యూ అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికైనా పేదల జోలికి రాకుండా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షులు విక్రంరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మహేందర్‌యాదవ్, కార్పొరేటర్ పానుగంటి బాబు, నాయకులు రంగుల శంకర్, జవహర్‌నగర్ పార్టీ అధ్యక్షులు కమల్, సంతోష్, సందీప్, యాదగిరి, అరుంధతి వాసులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?
ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు
ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ
ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News