Wasim Akram about Pakistan Team: కోతులు కూడా మీ కంటే చాలా బెటర్.. పాకిస్తాన్ టీమ్‌పై అక్రమ్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Feb 26 , 2025 | 07:04 PM
పాకిస్తాన్ జట్టు వరుస రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేవలం వారం రోజుల్లో పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ కథ ముగిసింది. ముఖ్యంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ పరాజయం పాక్ జట్టుపై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి, స్వదేశంలో టోర్నీ నిర్వహిస్తున్న పాకిస్తాన్ (Pakistan) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) నుంచి నిష్క్రమించే దశకు చేరుకుంది. వరుస రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేవలం వారం రోజుల్లో పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ కథ ముగిసింది. ముఖ్యంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో (Ind vs Pak) దారుణ పరాజయం పాక్ జట్టుపై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.
ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్ల ప్రదర్శనపై అభిమానులు, మాజీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ఆటగాడు వసీం అక్రమ్ (Wasim Akram) కూడా తాజాగా పాకిస్తాన్ టీమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు డైట్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో డ్రింక్స్ బ్రేక్‌లో ఆటగాళ్లు ఒక ప్లేట్ నిండా అరటిపళ్లు (Bananas) తినడం చూశానని, కోతులు (Monkeys) కూడా అన్ని అరటి పళ్లు తినవని అక్రమ్ వ్యాఖ్యానించాడు.
పాకిస్థాన్ జట్టులో ఏమాత్రం పురోగతి లేదని, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపైన తీవ్ర చర్యలు తీసుకోవాలని అక్రమ్ డిమాండ్ చేశాడు. సెలక్టర్లను కూడా మార్చాలని, జట్టులోకి యువరక్తాన్ని ఎక్కించాలని సూచించాడు. ధైర్యం లేకుండా, మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసి 2026 టీ20 ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధం చేయాలని సూచించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సెలక్టర్లలో కొందరికి ఒక్క మ్యాచ్ ఆడిన అనుభవం కూడా లేదని వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి..
Pak media on TeamIndia victory: భారత్ విజయంపై పాక్ మీడియా వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..
Team India Champions Trophy 2025: టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై పలువురు క్రికెటర్ల ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..