Share News

Virat Kohli: కోహ్లీ ఇలా చేసుండాల్సింది కాదు.. పాక్ మహిళా అభిమాని ఆవేదన వింటే.. వీడియో వైరల్..!

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:27 PM

దారుణ పరాజయంతో పాకిస్తాన్ అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ వారికి మరింత ఆవేదన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీమ్ అభిమాని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli: కోహ్లీ ఇలా చేసుండాల్సింది కాదు.. పాక్ మహిళా అభిమాని ఆవేదన వింటే.. వీడియో వైరల్..!
Virat Kohli

ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) మ్యాచ్‌లో పాకిస్తాన్ టీమ్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన టీమిండియా సునాయాస విజయం సాధించింది (Ind vs Pak). ఈ దారుణ పరాజయంతో పాకిస్తాన్ అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు (Pakistan Cricket Fans). ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ వారికి మరింత ఆవేదన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీమ్ అభిమాని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@Prof_Cheems అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. పాకిస్తాన్ ఓటమి పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో రూపొందించింది. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు కష్ఫ్ అలీ. కంటెంట్ క్రియేటర్ అయిన ఆమె పాకిస్తాన్ టీమ్ పట్ల ఆగ్రహం ప్రదర్శించింది. ``మా జట్టు సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఈ మ్యాచ్‌ తర్వాత, చాలా మంది మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. అభిమానులపై కొంచెం దయ చూపండి. బాగా ఆడండి. బాగా బ్యాటింగ్ చేయండి, బాగా ఫీల్డింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు మమ్మల్ని ఎందుకు పదే పదే ఇలా నిరాశపరుస్తారు. మా హృదయం మీతోనే ఉంది, ఇలా చేయకండి`` అని ఆమె ఆ వీడియోలో వ్యాఖ్యానించింది.


``విరాట్ కోహ్లీ ఇలా చేసి ఉండాల్సింది కాదు`` అని కామెంట్ చేస్తూ ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 6.7 లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. 14 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ``పాపం.. ఇంత అందమైన అమ్మాయిని ఏడిపించారు``, ``పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 03:31 PM