Indians: గత అయిదేళ్లలో.. 633 మంది విద్యార్థులు మృతి
ABN , Publish Date - Jul 30 , 2024 | 11:36 AM
ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు విదేశాలకు పయనమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. అయితే అలా ఉన్నత విద్య కోసం వివిధ విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో పలువురు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్నారు.
న్యూఢిల్లీ, జులై 30: ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు విదేశాలకు పయనమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. అయితే అలా ఉన్నత విద్య కోసం వివిధ విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో పలువురు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారి సంఖ్య.. గత అయిదేళ్లలో 633గా ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు.
Jharkhand train accident: ఇదా నా పాలన.. మోదీ ప్రభుత్వానికి చురకలంటించిన సీఎం మమత
అత్యధికంగా యూఎస్‌లో.. ఆ తర్వాత స్థానాలు వరుసగా..
వీరిలో అత్యధికులు అంటే.. 108 మంది అమెరికాలో మరణించారని తెలిపారు. ఇక బ్రిటన్‌లో 58 మంది, ఆస్ట్రేలియాలో 57 మంది, రష్యాలో 37 మంది మృతి చెందారని చెప్పారు. ఉక్రెయిన్‌లో 18 మంది, జర్మనీలో 24 మంది, జార్జీయాలో 12 మంది మరణించారన్నారు. ఇక సైప్రస్, కిర్గిస్థాన్, చైనాల్లో 8 మంది చొప్పున మృతి చెందారని రాత పూర్వకంగా మంత్రి కీర్తి వర్థన్ సింగ్ విపులీకరించారు.
Also Read: Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు
వివిధ కారణాలతో మరణాలు..
అయితే వీరంతా వివిధ కారణాలతో అంటే... సహాజ మరణాలు అయితేనేమి.. వివిధ ప్రమాదాల్లో అయితేనేమీ.. అనారోగ్య కారణాలతో అయితేనేమి మరణించారని సోదాహరణగా వివరించారు. ఇక విదేశాల్లో భారతీయ విద్యార్దులను సంరక్షించడంతోపాటు వారికి భద్రత కల్పించడంలో భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఈ సందర్బంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి స్పష్టం చేశారు. విదేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులతో.. ఆ యా దేశాల్లోని రాయబార కార్యాలయాలు ఎల్లప్పుడు సంప్రదింపులు నెరుపుతాయని పేర్కొన్నారు.
Also Read: Jharkhand: పట్టాలు తప్పిన ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు
ఎందుకో.. యూఎస్ కారణాలు చెప్పదు..
ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లిన విద్యార్థుల్లో పలువురిని తిరిగి స్వదేశానికి పంపేసింది. అయితే అందుకు కారణాలను సైతం ఆమెరికా వివరించ లేదు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ సహయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ తెలిపారు. లోక్‌సభలో ఇటీవల ఎంపీ బికె పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి కీర్తి వర్థన్ సింగ్ రాత పూర్వక సమాధానమిచ్చారు.
Also Read: President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన
గత మూడేళ్లలో 48 మంది..
గత మూడేళ్లలో 48 మందిని అమెరికా తిరిగి భారత్‌కు పంపేశారని వివరించారు. ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం పలు దేశాలకు వెళ్తున్నారని వివరించారు. అలా విద్యార్థులు వెళ్తున్న జాబితాలో అమెరికా సైతం ఉందన్నారు. అయితే ఒకే ఒక్క కారణం కూడా తెలుపకండా 48 మంది విద్యార్థులను భారతకు తిరిగి పంపేసిందన్నారు. ఇక విద్యార్థులను మాత్రం వెనక్కి ఎందుకు పంపుతుందనేది మాత్రం తమ దృష్టికి రాలేదని పేర్కొంది.
అనధికార ఉపాధి, తరగతులకు హాజరు కాకపోవడంతోపాటు వారిని సస్పెన్షన్ చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుని ఉండవచ్చని ఈ సందర్బంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. వీటి ఆధారంగా వారి స్టూడెంట్ వీసాలను రద్దు చేసి.. వెనక్కి పంపి ఉండవచ్చని అభిప్రాయపడింది.
Read More National News and Latest Telugu News