Home » Israeli-Hamas Conflict
లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మరో గట్టి దెబ్బ తగిలింది. గడిచిన మూడ్రోజులుగా.. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా సహా.. కీలక నాయకులు హతమవ్వగా.. ఆదివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో మరో కీలక నేత నబీల్ కౌక్ హతమయ్యాడు.
ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబరు 7న జరిగిన దాడుల రూపకర్త, ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్ చనిపోయినట్లుగా తెలుస్తోంది.
లెబనాన్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని 17 పట్టణాలు, పల్లెలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
బీరుట్, టెల్ అవీవ్, సెప్టెంబరు 22: పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది. నిన్నటివరకు హమా్‌స-ఇజ్రాయెల్ మధ్య సాగిన యుద్ధం ఇప్పుడు హిజ్బుల్లా- ఇజ్రాయెల్‌ల పూర్తిస్థాయి సమరంగా మారింది.
హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ శనివారం ముప్పేట దాడులు చేసింది.
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం గాజాలోని న్యూసెరాట్ శరణార్థుల శిబిరం సమీపంలోని ఓ ఇంటిపై బాంబుల వర్షం కురిపించింది.
గాజాలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైన్యం ఆదివారం ప్రకటించిన వెంటనే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ హమాస్ ఉగ్రవాద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్-హమా్‌సల మధ్య గత పది నెలలుగా సాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికేలా ఇరు దేశాల మధ్య చర్చలకు శ్రీకారం చుట్టినా ఏమాత్రం ఫలించలేదు.
ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల ముందు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
"నన్ను ప్రత్యర్థులు ఏ క్షణమైన చంపేస్తారని భయమేస్తోంది" ఇది అక్షరాల ఓ దేశానికి చెందిన యువరాజు వ్యాఖ్యలు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా చట్ట సభ సభ్యులతో ఇలా గోడు వెల్లబోసుకున్నారు.