Share News

Israel: హిజ్బుల్లా X ఇజ్రాయెల్‌

ABN , Publish Date - Sep 23 , 2024 | 03:26 AM

బీరుట్‌, టెల్‌ అవీవ్‌, సెప్టెంబరు 22: పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది. నిన్నటివరకు హమా్‌స-ఇజ్రాయెల్‌ మధ్య సాగిన యుద్ధం ఇప్పుడు హిజ్బుల్లా- ఇజ్రాయెల్‌ల పూర్తిస్థాయి సమరంగా మారింది.

Israel: హిజ్బుల్లా X ఇజ్రాయెల్‌

బీరుట్‌, టెల్‌ అవీవ్‌, సెప్టెంబరు 22: పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది. నిన్నటివరకు హమా్‌స-ఇజ్రాయెల్‌ మధ్య సాగిన యుద్ధం ఇప్పుడు హిజ్బుల్లా- ఇజ్రాయెల్‌ల పూర్తిస్థాయి సమరంగా మారింది. గాజా యుద్ధం మొదలయ్యాక ఎన్నడూ లేనంతగా.. హిజ్బుల్లా ఆదివారం తెల్లవారుతుండగానే నాలుగు దశల్లో ఉత్తర ఇజ్రాయెల్‌పైకి 100కు పైగా రాకెట్లను ప్రయోగించింది. వీటిలో కొన్ని హైఫా, నజారెత్‌ నగరాల సమీపంలో పడ్డాయి. హైఫా, రమత్‌ డేవిడ్‌ వైమానిక స్థావరాలపైకి ఫాది 1, ఫాది 2 క్షిపణులను ప్రయోగించినట్లు ఉగ్ర సంస్థ తెలిపింది.


బీరుట్‌పై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) దాడికి ఇది ప్రతీకారమని పేర్కొంది. చాలావరకు క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్‌.. ప్రతిగా లెబనాన్‌పై భారీఎత్తున దాడులకు దిగింది. 400 దాడులు చేసి రాకెట్‌ లాంచర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. హిజ్బుల్లా దాడులతో ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. హై అలర్ట్‌ ప్రకటించి వేలమందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. సరిహద్దుల్లోని తమ పౌరుడు ఒకరు చనిపోయినట్లు లెబనాన్‌ తెలిపింది.


ఇదిలా ఉండగానే వెస్ట్‌బ్యాంక్‌లోని అల్‌ జజీరా న్యూస్‌ చానెల్‌ కార్యాలయంలోకి వెళ్లిన ఇజ్రాయెల్‌ దళాలు దానిని సీజ్‌ చేశాయి. 45 రోజుల పాటు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చాయి. హిజ్బుల్ల్లాను చావుదెబ్బ కొట్టామని, ఇప్పటికీ వారికి పరిస్థితి అర్థం కాకపోతే, మరింత అర్థమయ్యేలా చెబుతామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. అల్‌ షతీ శరణార్థి శిబిరంలోని క్‌ఫ్ర ఖాసిం స్కూల్‌పై ఇజ్రాయెల్‌ దాడిలో ఏడుగురు చనిపోయారు.

Updated Date - Sep 23 , 2024 | 03:26 AM