Home » Jammu and Kashmir
ఏప్రిల్ 4వ తేదీ వరకూ లోక్సభ సమావేశాలు ఉన్నందున వాటికి హాజరయ్యేందుకు కస్టడీ పెరోల్ కానీ, తాత్కాలిక బెయిల్ కానీ మంజూరు చేయాలని విచారణ కోర్టును ఇటీవల రషీద్ కోరారు. అయితే అతని అభ్యర్థను కోర్టు మార్చి 10న కొట్టివేసింది.
జమ్మూకశ్మీర్లో తీవ్రవాదం, దేశంలో నక్సలిజంతో ఎదురవుతున్న సవాళ్లు, మాదకద్రవ్యాల బెడద, ఈశాన్య ప్రాంతంలోని సమస్యలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజ్యసభలో శుక్రవారంనాడు జరిగిన చర్చకు అమిత్షా సమాధానమిచ్చారు.
ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.
ఏఏసీ, జేకేఐఎంలు జమ్మూకశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ భారత వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నాయని ఎంహెచ్ఏ అధికారిక ప్రకటనలో పేర్కొంది. సాయుధ చొరబాట్లు, అంశాంతి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అశాంతి రెచ్చగొడుతున్నట్టు తెలిపింది.
జమ్మూకశ్మీర్లో బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్కు ఉచితంగా భూకేటాయింపులు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం తక్షణం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
ఒక పెళ్లికి హాజరయ్యేందుకు కథువా నుంచి ముగ్గురు స్థానికులు గత గురువారం బయలుదేరారు. అప్పట్నించీ వారి ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే వీరిలో ఒకరు తాము కొండప్రాంతంలో దారితప్పామంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
Kashmir Avalanche: హిమాలయ రాష్ట్రం కశ్మీర్లో భారీ హిమపాతం సంభవించింది. రోజుల తరబడి విపరీతంగా మంచు కురుస్తోంది. రహదారులు మూసివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అడుగుల ఎత్తులో మంచి కుప్పలు పేరుకుపోవడంతో ప్రజలు బయట అడుగుపెట్టాలంటేనే హడలిపోతున్నారు.
Jammu And Kashmir: జమ్ము కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ జవాన్లు సైతం ఎదురు కాల్పులకు తెగబడ్డారు. ఆ క్రమంలో ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి ఎర్డోగాన్ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ్దీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమని అన్నారు.
జమ్మూకశ్మీర్ పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టర్లో బుధవారం అర్ధరాత్రి తీవ్ర అలజడి నెలకొంది. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైన్యంపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపింది.