Home » Kavitha Arrest
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్‌అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్డడీ కోరుతూ నేడు( శుక్రవారం) సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జూన్ 21 వరకు రౌస్ అవెన్యూ కోర్టు కవితకు కస్డడీని పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Case) ఈడీ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఉంచింది. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై(MLC Kavitha) ఈడీ పలు అభియోగాలు మోపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. మళ్లీ తిరిగి జూన్ 7న కవితపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవితే కింగ్‌పిన్ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి బలమైన వాదనలు వినిపించింది. ఢిల్లీ మద్యం పాలసీలో ఆమెది కీలకపాత్ర అని కోర్టుకు వివరించింది. కవిత పాత్ర లేకపోతే ఆమె సాక్ష్యాలను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించింది.
తన ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఎన్నికల ప్రచారంలో తన ప్రతి కదలికను ముందే తెలుసుకుని, తనకు మద్దతు ఇచ్చే వారిని బెదిరించి, అడ్డదారిలో గెలిచిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావు డిమాండ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ ఈరోజు(సోమవారం)తో ముగిసింది. దీంతో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ రేపటితో(సోమవారం) ముగియనున్నది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ రేపు విచారణ జరగనున్నది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టు ముందు ఈడీ, సీబీఐ హాజరు పరిచే అవకాశం ఉంది.