Home » Kejriwal
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఆయన అభిమానులు టపాసులు కాల్చి స్వాగతం పలికారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేజ్రీవాల్ తీహాడ్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అనంతరం జైలు దగ్గర తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ఓ వాహనం పై నుంచి మాట్లాడుతూ... జైలు గోడలు తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, జైలుకు పంపాక తన మనోధైర్యం 100 రెట్లు పెరిగిందని చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ దక్కింది. ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ నేతలు ఇచ్చిన మెమొరాండంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర హోం శాఖకు సిఫారసు చేశారు.
National: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపనుంది. లిక్కర్ కేసులో ఐదు నెలలుగా కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
జైలు నుంచి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సెనాకు లేఖ రాయడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని తిహాడ్ జైలు అధికారులు సీఎం కేజ్రీవాల్ చర్యల్ని తప్పుబట్టారు.
మద్యం విధానం కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను లిస్టింగ్ చేయడాన్ని పరిశీలిస్తామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది.
లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆప్ నేత మనీశ్ సిసోడియాకు ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంపై ఆప్ నేతలు న్యాయం గెలిచింది అంటూ హర్షం వ్యక్తం చేశారు. సిసోడియాకు బెయిల్ వచ్చిందని తెలిసిన వెంటనే ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద దెబ్బ తగిలింది. చట్టం ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)లో సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కే ఉందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది.