Home » Krishna
ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడు మండలం, తుర్లపాడు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం దాడులకు దారితీసింది. పాత గొడవలు నేపథ్యంలో ఒకరిపై ఒకరు కర్రలు, గోడ్డళ్లతో దాడుదలకు దిగడంతో ఐదుగురు గాయపడ్డారు.
కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్(Krishna Tribunal ) గడువును కేంద్రం మరోసారి పెంచింది. రెండు తెలుగు రాష్ట్రాల(Two Telugu states) మధ్య జల వివాద పరిష్కారంపై తీర్పు ఇవ్వాల్సి ఉన్నందున కేంద్రం ఈ గడువు పొడిగించినట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వ పాల నలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ కార్యదర్శి మొక్కపాటి శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు శొంఠి శివరాం ప్రసాద్ విమర్శించారు.
కృష్ణాజిల్లా: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి పరుచూరి సుభాష్ చంద్రబోస్‌తో పాటు ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
జిల్లా, నగరపాలకసంస్థ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. జగనన్న సురక్ష ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ దిల్లీరావు స్థానిక కార్పొరేటర్ కె.అనితతో కలిసి 24వ డివిజన్ 88వ సచివాలయం పరిధిలోని గిరిపురంలో పరిశీలించారు.
గుంటూరు జిల్లా: తాడేపల్లి మండలం, సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేది తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు.
బుధవారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా విజయవాడలో 66.5 మిల్లీమీటర్లు, ఎ.కొండూరులో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా, పెడన మండలం, కూడూరుకు బయలుదేరి వెళ్లారు. వైఎస్సార్‌సీపీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్ కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు.
విజయవాడ: జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని తొమ్మిది సంవత్సరాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమ కార్యక్రమాలపై బీజేపీ నాయకులు సభలు నిర్వహిస్తున్నారు.
కృష్ణా జిల్లా: అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మట్టి మాఫియాని అరికట్టాలంటూ నాగాయలంక తహశీల్దార్ కార్యాలయ ముట్టడికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పిలుపిచ్చారు.