Home » Loans
ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారు? రైతుల వారీగా విడుదల చేసిన నిధులెన్ని? మొదటి, రెండో దశల్లో రుణమాఫీ పొందిన రైతుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు దశలవారీగా అంటూ మాట మార్చిందని, అది కూడా నామమాత్రంగానే అమలు చేస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం.. రూ. 6,191 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్(టీజీక్యాబ్)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) అంగీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని(Loan waiver) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలన్నీ ఒకే రోజులో మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన కాలయాపన వల్ల 8 నెలలుగా రైతు రుణాలపై పడిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని అన్నారు.
రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణం ఉన్న ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదన్నారు.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి స్కోర్ ఆనలైజర్. ఇది చైనా యాప్.. ఒక్కసారి మీరు దీనిని ఇన్ స్టాల్ చేశారో ఇక అంతే సంగతులు. వెంటనే గమనించి డీలేట్ చేయాలి. లోన్ కోసం ట్రై చేస్తూ.. కెమెరా, గ్యాలరీ, కాంటాక్ట్, మెక్రో కెమెరాకు పర్మిషన్ ఇచ్చారో.. అంతే సంగతులు. మీ డేటా మొత్తం లోన్ యాప్ చేతిలో ఉంటుంది.
దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల నుంచి హోం లోన్(Home Loans) తీసుకున్న వారు తిరిగి సకాలంలో కట్టట్లేదని ఆర్బీఐ(RBI) నివేదికలో వెల్లడైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే పర్సనల్ లోన్ సెగ్మెంట్ డేటాను విడుదల చేసింది.
స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)లోని మహిళలు ఎవరైనా అనుకోని సందర్భంలో మరణిస్తే.. వారు తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు పేద కుటుంబాలు అవస్థలు పడుతుంటాయి. సదరు మహిళ కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే.. ఇతర గ్రూపు సభ్యులే ఆ రుణ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రైతులు, కార్మికులతో సహా అణగారిన వర్గాల అభివృద్ధికి సంపదను ఖర్చు చేయడం గ్యారెంటీ.