Share News

RBI: ఆర్బీఐ ప్లాన్ సక్సెస్.. ఈ డిపాజిట్లు పెరిగాయన్న నివేదిక

ABN , Publish Date - Nov 27 , 2024 | 10:19 AM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక విషయాన్ని ప్రకటించింది. సాధారణ ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది. ఇటివల నివేదికలో ఆకర్షణీయమైన వడ్డీతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వృద్ధి కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాల (CASA) వృద్ధిని అధిగమించాయని తెలిపింది.

RBI: ఆర్బీఐ ప్లాన్ సక్సెస్.. ఈ డిపాజిట్లు పెరిగాయన్న నివేదిక
RBI report on term deposits

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటివల నివేదిక గుడ్ న్యూస్ తెలిపింది. గణాంకాల ప్రకారం రాబడిని అందించే టర్మ్ డిపాజిట్లు, CASA (కరెంట్ ఖాతా, సేవింగ్స్ ఖాతా)ల కంటే వృద్ధిని అధిగమించాయని వెల్లడించింది. ఈ క్రమంలో మొత్తం డిపాజిట్లలో ఈ వాటా సెప్టెంబర్ 2024లో 59.8% నుంచి 61.4%కి పెరగడం విశేషం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్రైమాసిక ‘బేసిక్ స్టాటిస్టికల్ రిటర్న్’ (BSR) నివేదికను విడుదల చేసిన క్రమంలో ప్రకటించింది.


మొత్తం డిపాజిట్లలో

అయితే ఈ ఏడాది మధ్యలో ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గినప్పటికీ, ఆర్‌బీఐ పాలసీ రేటులో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో RBI చేసిన ప్లాన్ పని చేసిందని నిపుణులు అంటున్నారు. మెరుగైన వడ్డీరేట్ల కారణంగా బ్యాంకుల్లోని మొత్తం డిపాజిట్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వాటా ఏడాది క్రితంతో పోలిస్తే 61 శాతానికి పైగా పెరిగింది. RBI ఫిబ్రవరి 2023 నుంచి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు.

దీంతో రెపో రేటు 6.50 శాతంగా ఉంది. అధిక రెపో రేటు కారణంగా, బ్యాంకులు గృహ రుణాలు, ఇతర రిటైల్ రుణాల వడ్డీ రేట్లు పెరిగాయి. కానీ బ్యాంకు డిపాజిట్లను పెంచడానికి, బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి పథకాలను పెంచాయి. దీంతో ద్రవ్యోల్బణం సమయంలో అనేక మంది తక్కువ ఖర్చు చేసి, ఎక్కువ పొదుపు చేశారు.


డిపాజిట్ల గణాంకాలు

డేటా ప్రకారం సెప్టెంబర్ 2024లో వార్షిక ప్రాతిపదికన బ్యాంక్ డిపాజిట్ వృద్ధి 11.7 శాతంగా ఉంది. ఇది దాదాపు గత త్రైమాసికంతో సమానం. జనాభాలోని అన్ని వర్గాల డిపాజిట్లలో (గ్రామీణ/సెమీ-అర్బన్/అర్బన్/మెట్రోపాలిటన్) రెండంకెల వార్షిక వృద్ధి నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్న శాఖలు మొత్తం డిపాజిట్లలో 66.5 శాతం పెరుగుదలను అందించాయి. మొత్తం డిపాజిట్లలో వీరి వాటా 54.7 శాతంగా ఉంది.


సీనియర్ సిటిజన్ల వాటా

RBI ప్రకారం మొత్తం డిపాజిట్లలో 51.4 శాతంలో మహిళా డిపాజిటర్లు వ్యక్తిగత డిపాజిట్లు 40 శాతం కలిగి ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ వృద్ధి సెప్టెంబర్ 2024లో వార్షిక ప్రాతిపదికన 9 శాతం పెరిగింది. ఇది జూన్ 2024లో 8.1 శాతంగా ఉంది. ఇతర బ్యాంకు గ్రూపుల్లో ఇది 15 శాతం లోపే ఉంది. సీనియర్ సిటిజన్ల డిపాజిట్ల వాటా సెప్టెంబర్ 2024లో 20.1 శాతానికి పెరిగింది. ఇది ఏడాది క్రితం 19.7 శాతంగా ఉంది.


బ్యాంకు రుణాలు కూడా..

షెడ్యూల్డ్ బ్యాంకుల బకాయి రుణాలపై రెండవ BCR ప్రకారం బ్యాంక్ క్రెడిట్ వృద్ధి మార్చి 2024లో 15.3 శాతం నుంచి సెప్టెంబర్ 2024లో వార్షిక ప్రాతిపదికన 12.6 శాతానికి తగ్గింది. బ్యాంకుల మెట్రోపాలిటన్ శాఖల రుణాల వాటా 60.6 శాతంగా ఉంది. ఈ శాఖలు 11.6 శాతం తక్కువ వృద్ధిని నమోదు చేశాయి. వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు, వ్యక్తిగత (హౌసింగ్‌యేతర) రుణాలలో ఆర్‌ఆర్‌బియేతర షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల రుణాల వాటా వరుసగా 11.5 శాతం, 23.7 శాతం, 16.5 శాతం, 14.9 శాతంగా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 27 , 2024 | 10:24 AM