Home » Loans
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమకు వచ్చి, అతికొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే పంటల సాగు ప్రారంభం కానున్నది.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్రం ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కోటక్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..
జగన్ సర్కారు ఆర్థిక అవకతవకలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి.
సాధారణంగా అనేక మంది మధ్య తరగతి ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని గడువు తేదీలోపు చెల్లించలేకపోతారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు గడువులోగా చెల్లించకుంటే రోజులను బట్టి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తాయి. ఇలాంటి క్రమంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
పంట రుణాల మాఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీ పథకం కోసం పంద్రాగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రూ.2 లక్షల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా ‘రైతు సంక్షేమ కార్పొరేషన్’ (ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్- ఎఫ్డబ్ల్యూసీ) ఏర్పాటుచేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే.
ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను ఆగస్గు 15 లోపు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ అంశంమే ప్రధాన ఎజెండాగా శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశమవుతోంది.
ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. ధరణి దరఖాస్తులకు సంబంధించిన అంతర్గత పరిశీలన పూర్తయినప్పటికీ, ఇంకా పెండింగ్లోనే ఉంచారు. ఈ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ఎప్పుడు చేపడుతారోనన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున.. నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకువచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పదే పదే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంట రాజేస్తున్న అంశం రూ.2 లక్షల రైతు రుణమాఫీ(Loan waiver). అసలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యమేనా.
రైతులందరికీ ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని, దైవసాక్షిగా కూడా ప్రమాణం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.