Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 230 మంది ఎమ్మెల్యేలలో 90 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 39 మంది శాతం ఎమ్మెల్యేలు ఈ కోవలోకి వస్తారు. వీరిలోనూ సీరియస్ క్రిమినల్ కేసులున్న వారు 34 మంది, అంటే 15 శాతంగా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ అసోసిషేయన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన రిపోర్ట్‌లో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
గర్భిణులకు ప్రసవ సమయంలో పలు రకాల ఇబ్బందులు ఎదురవడం చూస్తూనే ఉంటాం. మారుమూల గ్రామాల్లోని వారికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సమయానికి అంబులెన్సులు రాకపోవడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి...
డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. 163 స్థానాల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను కొనసాగిస్తారా, కొత్త పేరు తెరపైకి వస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడూ తన లక్ష్యం కాదని మంగళవారంనాడు తెలిపారు.
భోపాల్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విశ్వసనీయతపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ మరోసారి ప్రశ్నించారు. చిప్ ఉన్న ఏ మిషన్నైనా హ్యాక్ చేయవచ్చని అన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎంత హడావుడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓటర్లను ఆకర్షించేందుకు తారాస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడుతూ.. ఎన్నో హామీలు ఇస్తారు.
హిందీ గడ్డపై మూడు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2023లో బీజేపీ 164 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. సీఎం ఎవరనేది బీజేపీ అధిష్ఠానం ఇంకా ప్రకటించనప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ శివరాజ్ సింగ్నే సీఎంగా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఆదివారం వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణ మినహా మిగతా 3 రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
ఊహించిన విధంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ కంటే 90 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన జ్యోతిరాధిత్య సింధియా ప్రాంతమైన గ్వాలియర్-మాల్వా ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.