Share News

Viral: పొలాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న రైతులు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:26 PM

సాధారణంగా ఇళ్లు, ఆఫీస్‌లు, దుకాణాళ్లోనూ రక్షణ కోసం సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని కొందరు రైతులు తమ పొలాల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసుకున్నారు.

Viral: పొలాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న రైతులు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

సాధారణంగా ఇళ్లు, ఆఫీస్‌లు, దుకాణాళ్లో రక్షణ కోసం సీసీటీవీ (CCTV) కెమేరాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ (Madhyapradesh)లోని కొందరు రైతులు (Farmers) తమ పొలాల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసుకున్నారు. దొంగల నుంచి తమ వెల్లులి (Garlic) పంటను రక్షించుకునేందుకే రైతులు ఈ ఏర్పాటు చేసుకున్నారు. దేశీయంగా వెల్లుల్లి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో వెల్లుల్లి ధర ఏకంగా రూ. 600 దాటింది. దాంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మధ్యప్రదేశ్‌లోని చింద్‌వాడ జిల్లా మొహ్‌ఖేద్ ప్రాంతంలో వేసిన వెల్లుల్లి పంటను దొంగలు చోరీ చేశారు. దీంతో మేలుకొన్న రైతులు టెక్నాలజీ సహాయంతో ఈ చోరీలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. తమ పొలాల్లో (Garlic Fields)సీసీటీవీ కెమేరాలను అమర్చారు. ఆ కెమెరాలు సౌర శక్తితో పని చేస్తాయి. ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అలారం మోగిస్తాయి. ఈ కెమేరాలను అమర్చిన తర్వాత ఆ ప్రాంతంలో దొంగతనాలు బాగా తగ్గాయట.

ప్రస్తుతం వెల్లుల్లి ధరలు (Garlic prices) రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. వెల్లుల్లికి ఇంత రేటు రావడం తమ జీవిత కాలంలో చూడలేదని చాలా మంది రైతులు చెబుతున్నారు. గతేడాది వెల్లుల్లికి సరైన ధర రాకపోవడంతో రైతులు వెల్లుల్లి వైపు మొగ్గు చూపలేదు. దీంతో ఈ ఏడాది వెల్లుల్లి

Updated Date - Feb 17 , 2024 | 04:40 PM