Home » Madhya Pradesh
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.
మధ్యప్రదేశ్‌లోని రైసన్ జిల్లాలో సమ్ మద్యం ఫ్యాక్టరీపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆప్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఆకస్మిక దాడి చేసింది. ఆ ఫ్యాక్టరీలో 60 మందికిపైగా బాల కార్మికులు పని చేస్తున్నారు. వారిలో 20 మంది బాలికలు ఉన్నారు. వీరంతా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నట్లు కమిషన్ ఈ సందర్భంగా గుర్తించింది.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఆయన తన భార్యతో కలిసి ఈ రైలులో ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణికులతో మాటలు కలిపారు.
నిర్లక్ష్యంగా కొందరు, తొందరపాటు కారణంగా మరికొందరు రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. రోడ్డు దాటే సమయాల్లో చాలా మంది ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. అయితే ఇలాంటి..
రెండేళ్ల కింద కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కొడవలితో 95 వేట్లు వేసి దారుణంగా చంపిన కోడలికి మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. రేవా
ఇద్దరు మోసగాళ్లు దయ్యాల పేరుతో డాక్టర్‌ను, ఆయన భార్యను భయపెట్టారు. ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 31 లక్షల నగదు, సుమారు 50 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. అసలేం జరిగిందో కథనంలో తెలుసుకోండి..
ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్లో ఘనంగా జరుతోంది. మోదీ మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగం కానున్నారు.
రాజకీయ జీవితం దాదాపు ముగిసిందనుకున్న దశలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (65)కు అత్యంత కీలక బాధ్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తక్షణమే ఢిల్లీకి రావాలంటూ ఆయనకు కబురుపెట్టారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను తప్పించి ఆ స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం ఒకేసారి రెండు భారీ రికార్డులను సృష్టించింది. ఇక్కడి విజేతకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.75 లక్షల ఆధిక్యం వచ్చింది. పోలైన ఓట్లలో ‘నోటా’ రెండో స్థానం పొందడం గమనార్హం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ లాల్వానీకి సమీప ప్రత్యర్థికన్నా 11,75,092 ఓట్ల మెజార్టీ లభించింది.