Share News

Viral Video: నీళ్లలో కొట్టుకుపోతున్న కారు.. ఓ వ్యక్తి బయటికి దూకేయగా.. చివరకు అంతా చూస్తుండగానే..

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:36 PM

ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు అనూహ్య ప్రమాదాల నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంటారు. మరికొందరు మృత్యువుతో పోరాడి చివరకు...

Viral Video:  నీళ్లలో కొట్టుకుపోతున్న కారు.. ఓ వ్యక్తి బయటికి దూకేయగా.. చివరకు అంతా చూస్తుండగానే..

ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు అనూహ్య ప్రమాదాల నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంటారు. మరికొందరు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో పడేస్తుంటారు. ఇలాంటి విషాదకర ఘటనలకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రమాద ఘటనకు సంబంధిచిన వీడియో తెగ వైరల్ అవుతోంది. నీటిలో కొట్టుకుపోతున్న కారులో నంచి ఓ యువకుడు దూకేశాడు. అయితే మరో వ్యక్తి అందులోనే ఉండిపోయాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రపూర్‌లోని లాల్‌పేట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను వరద నీరు (floods) ముంచుత్తుతోంది. మరోవైపు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు వరద నీటిలో కొట్టుకుపోవడం కూడా జరుగుతోంది.

Viral Video: పామును పేపర్లలో చుట్టేసి నిప్పు పెట్టిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


తాజాగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తూ వెకోలి మహంకాళి కల్రిని కలిపే శ్వశాన వాటిక సమీపంలో జర్పత్ నది వంతెనను దాటుతున్నారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి వరద ఉదృతి పెరగడంతో చూస్తుండగానే (car washed away in flood water) కారు నదిలో కొట్టుకుపోయింది. కారు కొంచెం దూరం కొట్టుకుపోగానే లోపలి నుంచి ఓ వ్యక్తి బయటికి వచ్చి నీటిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే మరో వ్యక్తి నీటిలోకి దూకే క్రమంలో భయంతో మళ్లీ కారులోకి దూరిపోయాడు. చూస్తుండగానే ఆ కారు చాలా దూరం కొట్టుకుపోయింది. దీంతో అక్కడే ఉన్న వారంతా షాక్ అయ్యారు.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై ఇలాక్కూడా జరగొచ్చు.. ప్రయాణికుల మధ్యలో పడుకున్న వ్యక్తి.. చివరకు..


కారులో ఉన్న వ్యక్తికి ఏమైందో అని ఆందోళన చెందారు. అయితే ఈ ఘటనలో ఆ వ్యక్తి కూడా కారు నుంచి దూకేసి ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిసింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సమయాల్లో వంతెన దాటే సాహసం చేయడం ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఇద్దరూ ప్రాణాలతో బయటపడడం సంతోషంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 38 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కుని ఉన్న గరాటును 30 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపు బాగున్నట్లే..

Updated Date - Aug 01 , 2024 | 12:36 PM