Share News

Mahesh Kumar Goud: ఆనాడు బీజేపీ నేతల కళ్లు మూసుకుపోయాయా?

ABN , Publish Date - Apr 08 , 2025 | 03:57 AM

పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ నేతలు బంగారం లాంటి భూములను విక్రయించినప్పుడు బీజేపీ నేతల కళ్లు మూసుకుపోయాయా అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mahesh Kumar Goud: ఆనాడు బీజేపీ నేతల కళ్లు మూసుకుపోయాయా?

  • బీఆర్‌ఎస్‌ హయాంలో బంగారం లాంటి భూములను అమ్మినప్పుడు ఏం చేశారు?

  • ఎవరి అండతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టింది..

  • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌, 7 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ నేతలు బంగారం లాంటి భూములను విక్రయించినప్పుడు బీజేపీ నేతల కళ్లు మూసుకుపోయాయా అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అంటూ ఆ పార్టీ నేతలకు సవాల్‌ విసిరారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 11 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఏం ఉద్ధరించారో కిషన్‌ రెడ్డి చెప్పాలన్నారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతూ ఇతర పార్టీలపై విమర్శలు చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. సంఖ్యాబలం లేకపోయినా హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి అండ చూసుకుని బీజేపీ అభ్యర్థిని నిలబెట్టిందని ప్రశ్నించారు.


కాంగ్రె్‌సకు సంఖ్యాబలం లేకపోవడంతోనే అభ్యర్థిని నిలబెట్టలేదని.. ఎవరికి మద్దతు ఇచ్చే విషయంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. విభజన హామీల గురించి రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు ఏనాడైనా మాట్లాడారా అని నిలదీశారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు. మోదీ, షా అనుమతి లేనిదే సంజయ్‌ టిఫిన్‌ కూడా తినరని ఎద్దేవా చేశారు. బీసీలకు 42ు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చేలా తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..

మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...

For More AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 03:57 AM