Home » Mangalagiri
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ 2024 మంగళవారం ఉదయం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు.
అమరావతిలో జరగనున్న డ్రోన్ షో విజయవంతం చేయాలని డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం సీకే కన్వెన్షన్ సెంటర్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమగ్నమయ్యారు.
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏ120గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించామన్నారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని తెలిపారు. తమవద్ద ఉన్న ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించామని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ అడిగామని, ఆయన ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని..
సజ్జలతో పాటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున వచ్చారు. సజ్జలతో పాటు వైసీపీ నాయకులు స్టేషన్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతి లేదని తెలిపారు. దీంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో పోలీసులపై..
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.
గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు.
Andhrapradesh: ‘‘ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం’’ అని జగన్ అన్నారు.
‘క్లీన్ అండ్ గ్రీన్’లో భాగంగా మంగళగిరిలో పరిసరాల పరిశుభ్రతకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వచ్చారు.