Home » Manipur
చొరబాటు ద్వారా మణిపుర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) సంచలన ప్రకటన చేశారు. మణిపుర్ ను విచ్ఛిన్నం చేసే శక్తులు, ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో గత ఏడాది మే మాసంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహించే రోజులతోపాటు కౌంటింగ్ ప్రక్రియ జరిగే రోజు.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో రైఫిళ్లు కలిగి ఉన్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు SLR రైఫిల్స్‌తో పాటు ఏడు మొబైల్ ఫోన్లు, ఒక వాకీ టాకీ సెట్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో సలాం రామేశ్వర్ సింగ్, టోంగ్‌బ్రామ్ గ్యాంజిత్ సింగ్ అలియాస్ చింగ్లెన్సనా, పుఖ్రేమ్ ఇంగోచా సింగ్, తోక్చోమ్ టెంబా అలియాస్ వఖీబా ఉన్నారు.
సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
జాతుల మధ్య అల్లర్లతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్ లో మరో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఇంటి నుంచి అగంతకులు ఆయనను అహపరించుకుని వెళ్లారు . గత మేలో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినప్పటి నుంచి చోటుచేసుకున్న నాలుగో కిడ్నాప్ ఇది.
మణిపుర్ లో మరోసారి చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ స్పందించారు. చురచంద్‌పూర్ హింసాకాండపై విచారణ జరిపేందుకు మెజిస్టీరియల్ విచారణ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అల్లర్లతో అట్టుడికిపోయిన మణిపుర్ లో మరోసారి హింస చెలరేగింది. చురచంద్‌పూర్‌లో గురువారం రాత్రి కొందరు దుండగలు ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడ్డారు. వాహనాలను తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.
1961 తర్వాత మణిపూర్‌లో స్థిరపడిన వారిని తరలిస్తామని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సోమవారం (నిన్న) ప్రకటన చేశారు. కులాలు, వర్గాలు, మతాలకు అతీతంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. దాంతో మణిపూర్‌లో అక్రమంగా తలదాచుకున్న వారిని తరలించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత మణిపూర్‌కి వచ్చి స్థిరపడిన వారిని గుర్తించి, రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు. కులం, కమ్యూనిటీని పట్టించుకోకుండా.. 1961 తర్వాత రాష్ట్రానికి వచ్చిన వాళ్లందరికి వెనక్కు తిరిగి పంపిస్తామని ఉద్ఘాటించారు.
భారత ప్రధాని మోదీ మణిపూర్‌లో ఎందుకు పర్యటించడంలేదని ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. మణిపూర్‌కు వచ్చి ప్రధాని ప్రజలను కలవాలని అందరూ కోరుతున్నారని చెప్పారు. అసలు బీజేపీ ప్రభుత్వం మణిపూర్ ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.