Home » Manmohan Singh
మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అలా సాకారమైన తెలంగాణకు తానిప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణం చాలా బాధాకరమని, ఆయన మృతి దేశానికి తీరని నష్టమని సీఎం చంద్రబాబు అన్నారు.
పాతిక సంవత్సరాల నాటి మాట. 1999లో డాక్టర్ మన్మోహన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు (లోక్‌సభకు ఆయన పోటీ చేయడం అదే మొదటిసారి, అదే చివరిసారి). ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు.
Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సంతాప తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో మన్మోహన్ సింగ్ తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం అభివృద్ధి పథంలో ఏ విధంగా పరుగు పెట్టిందో ప్రశంసలు కురిపించింది.
మహారాష్ట్రలో తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో పీటీఐ వార్తా సంస్థతో హజారే మాట్లాడుతూ, పుట్టినవారికి మరణం తప్పదని, అయితే కొన్ని జ్ఞాపకాలు, వారసత్వం మాత్రం మిగిలిపోతాయని అన్నారు.
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వ్యక్తిగతంగా తనకు మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని ఒక సంతాప సందేశంలో నెమరువేసుకున్నారు. మన్మోహన్‌లోని మానవతా కోణాన్ని ఆయన ఆవిష్కరించారు.
మన్మోహన్ సింగ్ గొప్ప మనిషి, నిరాడంబరుడు, దేశ భక్తుడని డాక్టర్ పాండా చెబుతూ, తన పేషెంట్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మన్మోహన్ ఎప్పటికీ గుర్తిండిపోతారని అన్నారు.
TELANGANA: తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ సహకారం మరువరానిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో తనకు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని మన్మోహన్ సింగ్ నింపారని గుర్తుచేశారు.
CM Chandrababu: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించి.. ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
అనూహ్యంగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చేశారు! నాటి ప్రధాని పీవీ నరసింహారావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గాడిలో పెట్టారు!