Share News

KCR: మనోహ్మన్‌సింగ్‌కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:56 PM

TELANGANA: తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌ సహకారం మరువరానిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో తనకు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని మన్మోహన్ సింగ్ నింపారని గుర్తుచేశారు.

KCR: మనోహ్మన్‌సింగ్‌కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం
KCR

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌కు తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) తెలిపారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు హాజరై ఘన నివాళులర్పిస్తారని అన్నారు. ఈ మేరకు కేసీఆర్ ఇవాళ(శుక్రవారం) ఓ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరుకానుందని చెప్పారు. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టుగా మన్మోహన్ సింగ్ అమోఘమైన సేవలందించారని అన్నారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన తనకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.


వారెంతో స్థిత ప్రజ్జత కలిగిన దార్శనికులు అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం మరువరానిదని అన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో తనకు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని మన్మోహన్ సింగ్ నింపారని గుర్తుచేశారు. వారు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో తనకు వారందించిన సహకారం మరువలేనని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని అన్నారు. వారికి కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను, ఎంపీలను ఆదేశించానని కేసీఆర్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

TG High Court: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

Collector: ఆ నోటిఫికేషన్లను నమ్మొద్దు..

ఆర్థిక మార్గదర్శి అస్తమయం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 27 , 2024 | 04:06 PM