Ameenpur Case Twist: అమీన్‌పూర్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం
ABN , Publish Date - Apr 02 , 2025 | 10:50 AM
Ameenpur Case Twist: అమీన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ బయటపడింది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.

సంగారెడ్డి, ఏప్రిల్ 2: జిల్లాలోని అమీన్‌పూర్‌లో (Ameenpur) ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి చంపిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు పిల్లల హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు గుర్తించారు. టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీయడంతో రజిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషపదార్థం కలిపింది రజిత. అయితే భర్త చెన్నయ్య పెరుగు తినకుండా , వాటర్ ట్యాంక్ తీసుకొని కాలనీలో వాటర్ సప్లైకి వెళ్లిపోయాడు. భర్త వెళ్ళిన తరువాత పిల్లలకు పెరుగన్నం పెట్టింది నిందితురాలు.
అర్ధరాత్రి రెండు గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(08) విగతజీవులుగా పడి ఉన్నారు. కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో భర్త చెన్నయ్య ఆస్పత్రిలో చేర్పించాడు. ముగ్గురు చిన్నారులు మృతి చెందడంపై కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా భర్త చెన్నయ్యపైనే అనుమానం వ్యక్తం చేశారు. లోతుగా విచారణ జరుపగా రజిత బాగోతం బట్టబయలైంది. రజిత టెన్త్ క్లాస్ ప్రియున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐదురోజుల క్రితం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. అలాగే తల్లి కూడా తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు చిన్నారులు చనిపోడానికి కారణం ఏంటి అనే దానిపై పోలీసులు ఆరా తీయగా.. సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా వివాహేతర సంబంధమే ముగ్గురు చిన్నారుల చావుకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది కన్నతల్లి రజితే అని పోలీసులు గుర్తించారు. అయితే రజిత టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ గెట్ టూ గెదర్ పార్టీలో ఓ వ్యక్తితో పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి జీవించాలని భావించగా.. పిల్లలు, భర్తను అడ్డుతొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత నెల 27న తాను అనుకున్న ప్లాన్ అమలు చేయాలని భావించింది రజిత. ఇందులో భాగంగానే ముగ్గురు పిల్లలు, భర్తకు విషం కలిపిన అన్నం తినిపించి వారిని చంపాలని ప్లాన్ వేసింది.
అనుకున్నదే తడువుగా పిల్లలకు పెరుగులో విషం కలిపి తినిపించింది. భర్తకు కూడా పెట్టాలని చూసినప్పటికీ అతడు వాటర్ ట్యాంక్ సప్లై ఉండటంతో బయటకు వెళ్లిపోయాడు. ఆపై పిల్లలతో పాటు తాను కూడా పెరుగన్నం తిన్నది రజిత. రాత్రి ఇంటికి భర్త ఇంటికి చేరుకోగా అందరూ పడుకుండిపోయారు. అయితే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంతో కడుపునొప్పితో బాధపడుతున్న రజితను భర్త సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం పిల్లలను చూడగా.. ముగ్గురు కూడా విగతజీవులుగా పడి ఉన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధమే ముగ్గురు పిల్లల చావుకు కారణమని పోలీసులు తేల్చారు. దీంతో అనుమానస్పద మృతి కేసును హత్యగా కేసుగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కన్న తల్లే ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి
Chicken Neck History: ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చికెన్ నెక్ చరిత్ర ఇదే
Rice: సన్నబియ్యం కోసం సందెవేళలోనూ..
Read Latest Telangana News And Telugu News